అందుకోసం చిరు చైనా వెళ్ళారా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన విప్లవం అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు. విజయాల్ని సాధిస్తున్నారు. వీటికి ఉదాహరణగా రోబో`, బాహుబలి` సిరీస్ వంటి సినిమాలను చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి` చిత్రానికి కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోబోతున్నారు దర్శక, నిర్మాతలు.
ఈ సినిమాకి సంబంధించి.. చిరు గెటప్‌కు కావాల్సిన ముఖ కవళికలను కంప్యూటర్లో బంధించేందుకు.. ఇలా క్లీన్ షేవ్ అవసరం పడిందట. ఇందులో భాగంగానే నిన్నమొన్నటివరకు గుబురు గెడ్డంలో ఉన్న చిరు...ఉన్నట్టుండి మీసం, గెడ్డం తీసేశారు. అంతేగాకుండా, ఈ విషయమై చిరంజీవి చైనా వెళ్ళి వచ్చారట కూడా. అక్కడ ఒక సంస్థ జరిపిన సెషన్లో కొన్ని గంటల పాటు, కొన్ని వందల కెమెరాల మధ్య చిరంజీవి హావభావాలను ఇస్తుండగా...వాటిని కంప్యూటర్లలో బంధించారు. సినిమాను గ్రీన్ మ్యాట్‌పై చిత్రీకరించిన తర్వాత కంప్యూటర్లలో అప్లోడ్ చేశాక...విజువల్ ఎఫెక్ట్స్ లో ముఖంలోని హావభావాలు అనుకున్న విధంగా తీసుకురావడం కోసం ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే చిరంజీవి క్లీన్ షేవ్‌తో చైనా వెళ్లి వచ్చారు.దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా వెళ్ళాల్సి వుండగా...కొన్ని కారణాల వలన ఆఖరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారని సమాచారం. కాగా, ఈ నెలలోనే ఈ సినిమాకి సంబంధించిన రెండో షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments