చైతన్య అందుకనే అ ఆ చేయలేదా..?
Tuesday, May 3, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రాన్ని నాగ చైతన్యతో చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. చైతన్యతో త్రివిక్రమ్ మూవీ కన్ ఫర్మ్..త్వరలోనే ఎనౌన్స్ మెంట్ అనుకున్నారు. ఇంతలో సడన్ గా చైతు ప్లేస్ లో నితిన్ వచ్చాడు. అదే అ ఆ చిత్రం. అయితే...ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్ మూవీ అని..అందుకనే చైతన్య ఈ సినిమా అంగీకరించలేదని ఓ వైపు ప్రచారం జరిగితే... చైతన్య సాహసం శ్వాసగా సాగిపో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుచేతనే ఈ ప్రాజెక్ట్ చేయడం కుదరలేదు అంటూ మరో ప్రచారం జరిగింది.
ఇదిలా ఉంటే.... అ ఆ ఆడియో వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ...ఇది హీరో సినిమానా..? హీరోయిన్ ఓరియంటెడ్ సినిమానా అని ఆలోచించకుండా ఈ సినిమా చేసినందుకు నితిన్ కి థ్యాంక్స్ అని చెప్పారు. చైతన్య అ ఆ ఎందుకు చేయలేదో తెలియదు కానీ...త్రివిక్రమ్ మాటలు - ట్రైలర్ చూస్తుంటే అ ఆ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని...సమంత పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అర్ధం అవుతుంది. అదీ సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments