పొలిటీషియ‌న్స్ ని టార్గెట్ చేసిన డిక్టేట‌ర్

  • IndiaGlitz, [Friday,January 08 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య న‌టించిన డిక్టేట‌ర్ సంక్రాంతికి సంద‌డి చేయ‌డానికి ఈనెల 14న వ‌స్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెర‌కెక్కించారు. బాల‌య్య స‌ర‌స‌న అంజ‌లి, సోనాల్ చౌహాన్, అక్ష న‌టించారు. ఇక బాల‌య్య క్యారెక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే...రెండు విభిన్న పాత్ర‌ల‌తో బాల‌య్య న‌ట‌న సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ట‌.

ముఖ్యంగా సెకండాఫ్ లో బాల‌య్య పొలిటిక‌ల్ లీడ‌ర్స్ ను టార్గెట్ చేస్తూ...ప‌వ‌ర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ చెప్పాడ‌ట‌. అయితే బాల‌య్య‌బాబు ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉండ‌డంతో...ప్ర‌తిప‌క్షంలో ఎవ‌ర్ని టార్గెట్ చేసార‌నేది ఆస‌క్తిగా మారింది. అలాగే సెకండాఫ్ లో వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్స్ కూడా హైలెట్ గా నిలుస్తాయ‌ని న‌మ్మ‌కంతో ఉన్నారు చిత్ర‌యూనిట్. మ‌రి...బాల‌య్య ఎవ‌ర్ని టార్గెట్ చేసార‌నేది తెలియాలంటే ఈనెల 14 వ‌ర‌కు ఆగాల్సిందే.