'డిక్టేటర్ ' సక్సెస్ నాలో రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది...బాలకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం డిక్టేటర్. సంక్రాంతి సందర్భంగా ఈసినిమా జనవరి 14న విడుదలైంది. సోమవారం ఈ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా...
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ `ఈరోజు నాన్నగారి 20వ వర్ధంతి. నా దృష్టిలో ఆయనే లెజెండ్. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో విబిన్నమైన పాత్రలు చేస్తుంటాను. ఈ టైటిల్ పెట్టినప్పుడు పెద్దగా టెన్షన్ పడలేదు కానీ సినిమా బాగా వచ్చేలా చూసుకోవాలని శ్రీవాస్‌తో చెప్పాన. శ్రీవాస్ మంచి తపన గల దర్శకుడు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి ఎంతో జాగ్రత్తగా ఈ సినిమానున రూపొందించారు. టీం అంతా ,చాలా కష్టపడి రాత్రి పగలు కష్టపడటంతోనే సినిమాను సంక్రాంతికి విడుదల చేయగలిగాం. శ్యాం కె.నాయుడు ప్రతి సీన్‌ను అందంగా, రిచ్‌గా చూపించారు. గౌతంరాజుగారు వెయ్యి సినిమాలను ఎడిటింగ్ చేశారు. థమన్ చాలా మంచి మ్యూజిక్‌నిచ్చారు. ఈ సినిమా సక్సెస్ నాలో రెట్టింపు బలం, ఉత్సాహాన్నిచ్చింది. నా చివరి రక్త బొట్టు వరకు తెలుగు ప్రేక్షకులకు వైవిధ్యమైన చిత్రాలను అందించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను`` అన్నారు.
శ్రీవాస్ మాట్లాడుతూ `మాస్ హీరో అంటే ఉన్న ఫీల్‌ను బాలయ్య మరోసారి ప్రూవ్ చేశారు. ఈ సినిమా సక్సెస్ అయిన రోజు 8-9 గంటలు వరకు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాను. ఎన్టీఆర్ వర్ధంతిరోజున ఈ కార్యక్రమం జరగడం హ్యపీగా ఉంది. 98 సినిమాలు చేసిన 99వ సినిమా చేయాలంటే చాలా కష్టం. ఎలా చూపించాలో ఆలోచించి బాలయ్యను కొత్త యాంగిల్‌లో చూపించాలనుకున్నాం. ఇందులో పనిచేసిన ఆర్టిస్ట్స్, టెక్నిషియన్స్ తమ సినిమాగా భావించిఈ సినిమా కోసం పనిచేశారు. ఈరోస్ సంస్త ఎంతో నమ్మకంతో ఈ సినిమా బాధ్యతను నాకు అప్పగించింది. ఈ సంస్థతో కలిసి భవిష్యత్‌లో పనిచేయనున్నాం`` అన్నారు.
ఈ కార్యక్రమంలో సుమన్, శ్యామ్ కె.నాయుడు, గౌతంరాజు, సోనాల్ చౌహాన్, రఘుబాబు, జ్యోతి, రాజీవ్ కనకాల, శ్రీధర్ సీపాన, రత్నం, భాస్కరభట్ల, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments