పాటల చిత్రీకరణలో 'డిక్టేటర్'
Send us your feedback to audioarticles@vaarta.com
లెజండ్`, లయన్` వంటి వరుస విజయాలు తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా డిక్టేటర్`. శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందనున్న ఈ చిత్రం ఎంటర్ టైనింగ్ ఫార్ములాతో తెరకెక్కనుంది. అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు
కోనవెంకట్, గోపిమోహన్, శ్రీధర్ సీపాన తదితరులు తమ వంతు సపోర్ట్అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతుంది. గమ్ గమ్ గణేష..అంటూ గణనాథుడుపై సాగే పాటను చిత్రీకరిస్తున్నారట. దీనికి ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com