గుమ్మడికాయ పండుగ జరుపుకున్న 'డిక్టేటర్'
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం డిక్టేటర్. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు.
సినిమా షూటింగ్ మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మడికాయ పండుగను జరుపుకుంది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, కో ప్రొడ్యూసర్, దర్శకుడు శ్రీవాస్ సహా యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. సినిమా తుది మెరుగులు దిద్దుకుని ముందుగా ప్రకటించిన జనవరి 14న డిక్టేటర్ మన ముందుకు రాబోతున్నాడు. అల్రెడి థమన్ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసిన యాక్షన్ ట్రైలర్‌కు ప్రేక్షాభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. నందమూరి అభిమానులు బాలకృష్ణను ఎలా చూడాలనుకుంటున్నారో ఆ రేంజ్‌లో స్టయిలిష్‌గా, పవర్‌ఫుల్‌గా బాలకృష్ణ పాత్ర ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుందని కో ప్రొడ్యూసర్, దర్శకుడు శ్రీవాస్ తెలియజేశారు.
బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక థియేటర్స్‌లో సినిమా విడుదల చేస్తున్నారు. అన్నీ ఏరియాల బిజినెస్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైపోయాయి. సినిమా భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ లెవల్‌గా విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com