'డిక్టేటర్' కి అంజలి సెంటిమెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
రచ్చ గెలిచి.. ఇంట గెలిచిన కథానాయిక అంజలి. తొలుత తమిళ సినిమాల్లో తన ప్రతిభను చాటుకుని.. ఆనక తెలుగు సినిమాల్లోనూ విజయబావుటా ఎగరవేసింది ఈ తెలుగమ్మాయి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన అంజలి.. 'బలుపు', 'మసాలా', 'గీతాంజలి' చిత్రాల్లోనూ నటిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అంజలి.. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ సరసన 'డిక్టేటర్' కోసం ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. 'లెజెండ్' ఫేమ్ సోనాల్ చౌహాన్ ఇందులోని మరో హీరోయిన్.
'డిక్టేటర్'లో అంజలి పాత్ర యాక్టింగ్ స్కోప్ ఉన్నదని చిత్ర యూనిట్ స్పెషల్ గా మెన్షన్ చేస్తోంది. అంజలి కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే పెట్టుకుంది. ఇదిలా ఉంటే.. వెంకటేష్, మహేష్‌బాబు వంటి స్టార్ హీరోలతో తను తొలిసారిగా కలిసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఎలాగైతే సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అయిందో.. అదే విధంగా అదే సీజన్‌లో రానున్న మరో టాప్ స్టార్ చిత్రం 'డిక్టేటర్' కూడా అదే సెంటిమెంట్‌తో బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని అంజలి నమ్మకంగా ఉందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com