బాలీవుడ్ లో డిక్టేటర్...

  • IndiaGlitz, [Tuesday,December 08 2015]

నంద‌మూరి న‌ట సింహం బాల‌క్రిష్ణ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ డిక్టేట‌ర్. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెర‌కెక్కిస్తున్నారు. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ డైరెక్ట‌ర్ శ్రీవాస్ తో క‌లిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డం విశేషం. బాల‌య్య స‌ర‌స‌న అంజ‌లి, సోనాలి చౌహాన్, అక్ష న‌టిస్తున్నారు. ఎస్.ఎస్.త‌మ‌న్ సంగీతాన్ని అందించిన డిక్టేట‌ర్ మూవీ ఆడియోను ఈనెల 20న గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

డిక్టేట‌ర్ మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ డిక్టేట‌ర్ మూవీని హిందీలో రీమేక్ చేయాల‌నుకుంటుంద‌ట‌. డైరెక్ట‌ర్ శ్రీవాస్ నే బాలీవుడ్ రీమేక్ ని డైరెక్ట్ చేయ‌మంటుంద‌ట‌. ఈ క‌థ‌కి అజ‌య్ దేవ‌గ‌న్ అయితే బాగుంటుది అని అనుకుంటున్నారు. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే డైరెక్ట‌ర్ శ్రీవాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌డం డిక్టేట‌ర్ తోనే కావ‌చ్చు.