'డిక్టేటర్' డేట్ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహా్ం బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్. ఈ సినిమాలో బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహన్ నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఫస్ట్ టైం నిర్మాణ రంగంలో ప్రవేశించి సినిమా తీస్తుండడం ఓ విశేషమైతే...డైరెక్టర్ శ్రీవాస్ కూడా ఫస్ట్ టైం నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని ఈరోస్ తో కలసి నిర్మిస్తుండడం మరో విశేషం.
రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, శ్రీధర్ సీపాన, డైమండ్ రత్నం వర్క్ చేసిన డిక్టేటర్ కి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయలనుకున్నారు. అయితే సంక్రాంతి రేసు నుంచి డిక్టేటర్ తప్పుకుందని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నేపధ్యంలో చిత్రయూనిట్ డిక్టేటర్ రిలీజ్ విషయంలో తేడా లేదని ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు మరోసారి ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com