ఖైరతాబాద్ లో 'డిక్టేటర్'
Send us your feedback to audioarticles@vaarta.com
బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్. ఈ సినిమా రెండు షెడ్యూళ్ళను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలోని గం గం గణేశా పాటను ఖైరతాబాద్‌లోని వినాయకుడి విగ్రహం ముందు గురువారం విడుదల చేశారు. బాలకృష్ణ, అంజలి, కోన వెంకట్, దర్శకుడు శ్రీవాస్‌తో పాటు పలువురు చిత్ర యూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరోస్ తో కలిసి శ్రీవాస్ కూడా నిర్మిస్తున్న సినిమా ఇది. తమన్ సమకూర్చిన బాణీకి రామజోగయ్యశాస్త్రి గమ్ గమ్ గణేశా అనే పాటను రాశారు. సినిమా చాలా బాగా వస్తోందని శ్రీవాస్ చెబుతున్నారు. త్వరలో హైదరాబాద్‌లోనే మరో షెడడ్యూల్ కూడా ఉంటుందని ఆయన అన్నారు. వినాయకచవితి సందర్భంగా వినాయకుడి పాటను విడుదల చేయడం పట్ల చిత్ర బృందమంతా ఆనందాన్ని వ్యక్తం చేసింది. బాలకృష్ణ, అంజలి రావడంతో ఖైరతాబాద్ ప్రాంతంలో గురువారం రాత్రి సందడి మొదలైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com