ముగ్గుల పండక్కి డిక్టేటర్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా డిక్టేటర్. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. అంజలి, సోనాల్ చౌహాన్ నాయికలు. ఈరోస్ తో కలిసి శ్రీవాస్ కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి టీమంతా గట్టిగా కృషి చేస్తోంది. షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది.
కోనవెంకట్, గోపీ మోహన్ కథను అందించిన ఈ సినిమా పట్ల అభిమానులు ఎక్కువ ఆశలు పెంచుకుంటున్నారు. బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. శ్రీధర్ సీపాన స్క్రీన్ ప్లేను, ఎంరత్నం మాటల్ని అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com