సెన్సార్ కి ముహూర్తం ఫిక్స్ చేసిన డిక్టేటర్..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహాం బాలయ్య నటించిన తాజా చిత్రం డిక్టేటర్. శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలో ప్రవేశించి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. సినిమా ప్రారంభోత్సవం, ఆడియో ఫంక్షన్, సినిమా రిలీజ్ కు మంచి తేదీ, ముహూర్తం చూసుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే బాలయ్య డిక్టేటర్ సినిమా సెన్సార్ చేయడానికి కూడా ముహుర్తం ఫిక్స్ చేసారట.
ఈనెల 6న అనగా రేపు ఉదయం 9.36 నిమిషాలకు డిక్టేటర్ మూవీ సెన్సార్ కి ముహుర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ యు ఎ సర్టిఫికెట్ ఇస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. రేపు మధ్యాహ్నంకు డిక్టేటర్ సెన్సార్ రిపోర్ట్ తెలుస్తుంది. బాలయ్య సరసన అంజలి, సోనాలి చౌహాన్, అక్ష నటించారు. బాలయ్య 99వ సినిమాగా రూపొందిన డిక్టేటర్ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com