డిక్టేటర్ ఆడియో సక్సెస్ మీట్ వాయిదా..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటించిన తాజా చిత్రం డిక్టేటర్. శ్రీవాస్ తెరకెక్కించిన డిక్టేటర్ మూవీ సంక్రాంతికి సందడి చేయడానికి వస్తుంది. ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. బాలయ్య సరసన అంజలి, సోనాలి చౌహాన్, అక్ష నటించారు. డిక్టేటర్ ఆడియో సాధించిన విజయాన్ని పురస్కరించుకుని డిక్టేటర్ ఆడియో సక్సెస్ మీట్ ప్లాన్ చేసారు.
అయితే ఈ ఆడియో సక్సెస్ మీట్ ను ఈ నెల 4న ప్లాన్ చేసారు.. కుదరలేదు. ఆతర్వాత 6న అంటే ఈరోజు ఆడియో సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించాలనుకున్నారు. కానీ మళ్లీ వాయిదా వేసారు. తాజాగా డిక్టేటర్ ఆడియో సక్సెస్ మీట్ ను ఈనెల 9న ప్లాన్ చేసారు. ముందుగా ఈ వేడుకను శిల్పకళావేదికలో నిర్వహించాలనుకున్నారు. మారిన డేట్ తో పాటు వేదికను కూడా శిల్పకళావేదిక నుంచి జె.ఆర్.సి పంక్షన్ హాల్ కు మార్చారు. మరి...సంక్రాంతి పోటీలో డిక్టేటర్ ఏరేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments