డిక్టేటర్ ఆడియో డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Thursday,November 05 2015]

నంద‌మూరి న‌ట‌సింహాం బాల‌క్రిష్ణ న‌టిస్తున్న 99వ సినిమా డిక్టేట‌ర్. ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ శ్రీవాస్ తెర‌కెక్కిస్తున్నారు. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌తో క‌ల‌సి డైరెక్ట‌ర్ శ్రీవాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డం విశేషం. దాదాపు 70 % షూటింగ్ పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుక‌గా డిక్టేట‌ర్ చిత్రాన్నిజ‌న‌వ‌రి 14న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆడియో విష‌యానికి వ‌స్తే...ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలో డిక్టేట‌ర్ సినిమా ఆడియో ఫంక్ష‌న్ గ్రాండ్ గా నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబ‌ర్ 1కి టాకీ పార్ట్ మొత్తం పూర్త‌వుతుంది. త‌మ‌న్ సంగీతాన్ని అందించిన డిక్టేట‌ర్ ఆడియోను డిసెంబ‌ర్ 20న సినీ,రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో నిర్వ‌హించ‌నున్నారు.