డిసెంబర్ 20న 'డిక్టేటర్' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్ మూవీ డిక్టేటర్`. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్. లౌక్యం`వంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ అందించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబర్ 20న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్నారు.
ప్రపంచ శాంతిదూత గౌతమబుద్ధుడు నడయాడిన నేగా పేరుగాంచిన అమరావతిలో ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా ఇటీవ కాలచక్రను నిర్వహించారు. ఆ కార్యక్రమం తర్వాత అమరావతిలో జరగున్ను వేడుక డిక్టేటర్` చిత్ర ఆడియో విడుదల. అంతే కాకుండా అమరావతిలో జరుగనున్న తొలి సినిమా కార్యక్రమం కూడా ఇదే కావడం విశేషం. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు పలువురు ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు కూడా తరలిరానున్నారు. ఈ సందర్భంగా...
కో ప్రొడ్యూసర్, చిత్ర దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ నందమూరి బాకృష్ణగారి 99వ చిత్రం డిక్టేటర్` గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా ప్రారంభం నుండి భారీ అంచనాలతోనే సాగింది. ఎప్పుడెప్పుడు బాలయ్యను తెరపై చూద్దామా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నందమూరి అభిమానులు బాలకృష్ణను ఎలా చూడానుకుంటున్నాడో అలాంటి కథ. డిఫరెంట్‌గా ఉంటూనే ఇప్పటి వరకు బాలకృష్ణగారు చూడని స్టయిలిష్ యాంగిల్ కనపడతారు. యాక్షన్, ఎమోషనల్ డ్రామా ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సరికొత్త సబ్జెక్ట్. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ సంస్థ సౌత్‌లో ప్రొడ్యూస్ చేస్తున్న తొలి సినిమా కావడం, ఇటువంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో మా వేదాశ్వ క్రియేషన్స్ పార్ట్ కావడం ఆనందంగా ఉంది.
శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, థమన్ మ్యూజిక్ ఎక్సలెంట్. థమన్ ఎలాంటి మ్యూజికల్ హిట్స్ చేశాడో మనకు తెలిసిందే. బాకృష్ణగారితో థమన్ చేస్తున్న మొదటి సినిమా ఇదే. కాబట్టి చాలా ఎక్స్ట్రార్డినరీ ట్యూన్స్ ను అందించాడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని పలువురి ప్రముఖు ఆధ్వర్యంలో డిసెంబర్ 20న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. బాకృష్ణగారు అందించిన సహకారంతో సినిమా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న సమయంలోనే పూర్తవుతుంది. సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout