బ్రిటిష్ ప్లారమెంట్ లో కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు 'డైలాగ్ బుక్' ఆవిష్కరణ
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడిగా డా.మోహన్ బాబు నవంబర్ 22, 2015 నాటికి 40 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంబరాల్లో చాలా కార్యక్రమాలను ప్రకటించారు. అందులో భాగంగా డా.మోహన్ బాబు నటించిన సినిమాల్లో ఫేమస్ డైలాగ్స్ అన్నింటినీ 'డైలాగ్ బుక్' రూపంలోకి తీసుకువచ్చారు. ఈ బుక్ ను మే 11న, బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్ లో సాయంత్రం 6.30 నుండి 8.30మధ్య నిర్వహిస్తారు. ఏసియన్ లైట్ అనే సంస్థ, బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్ మన్ సంయుక్తంగా డా.మోహన్ బాబును గౌరవిస్తారు.
శ్రీ విద్యానికేతన్ అనే విద్యా సంస్థను నెలకొల్పి అనేక విద్యార్థులకు విద్యను అందిస్తున్ మోహన్ బాబు 40 వసంతాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పుట్టినరోజు మే 19న, బెస్ట్ టీచర్ అవార్డును అందజేస్తున్నారు. అలాగే సినిమా రంగంలోనే కాకుండా తెలుగు వారికి అనేక మార్గాల్లో తన సహాయ సహకారాలను అందిస్తున్న డా.మోహన్ బాబు సేవలను గుర్తించి ఆయన్ను సత్కరిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com