ప్రమాదం అంచున డయాబెటిస్ రోగులు..
- IndiaGlitz, [Sunday,June 28 2020]
ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే కరోనా నుంచి బయటపడటం చాలా కష్టమని వైద్యులు వెల్లడిస్తూనే ఉన్నారు. అయితే డయాబెటిస్ పేషెంట్లకు మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణలో కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 240 మందికి పైగా మృతి చెందారు. అయితే ఇటీవల నిర్వహించిన సర్వేలో మృతుల్లో 120 మందికి పైగా డయాబెటిస్ ఉన్నట్టు తేలగా.. 88 మందికి డయాబెటిస్, హైపర్ టెన్షన్ రెండూ ఉన్నట్టు తేలింది. మృతుల్లో మరికొందరు ఇతర జబ్బులవారు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
కాగా.. హుద్రోగులు, అధిక రక్తపోటు ఉన్నవారు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ తిరిగి వైరస్ బారిన పడే అవకాశముందని చైనాలోని హువాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. వీరు జరిపిన పరీక్షల్లో హుద్రోగులు, అధిక రక్తపోటు ఉన్నవారికి 58శాతం వైరస్ తిరిగి సోకే అవకాశం ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి డయాబెటిస్, హృద్రోగం, అధిక రక్తపోటు తదితర అనారోగ్య సమస్యలు ఏమున్నా వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.