ప్రమాదం అంచున డయాబెటిస్ రోగులు..

  • IndiaGlitz, [Sunday,June 28 2020]

ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే కరోనా నుంచి బయటపడటం చాలా కష్టమని వైద్యులు వెల్లడిస్తూనే ఉన్నారు. అయితే డయాబెటిస్ పేషెంట్లకు మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణలో కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 240 మందికి పైగా మృతి చెందారు. అయితే ఇటీవల నిర్వహించిన సర్వేలో మృతుల్లో 120 మందికి పైగా డయాబెటిస్ ఉన్నట్టు తేలగా.. 88 మందికి డయాబెటిస్, హైపర్ టెన్షన్ రెండూ ఉన్నట్టు తేలింది. మృతుల్లో మరికొందరు ఇతర జబ్బులవారు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

కాగా.. హుద్రోగులు, అధిక రక్తపోటు ఉన్నవారు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ తిరిగి వైరస్ బారిన పడే అవకాశముందని చైనాలోని హువాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. వీరు జరిపిన పరీక్షల్లో హుద్రోగులు, అధిక రక్తపోటు ఉన్నవారికి 58శాతం వైరస్ తిరిగి సోకే అవకాశం ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి డయాబెటిస్, హృద్రోగం, అధిక రక్తపోటు తదితర అనారోగ్య సమస్యలు ఏమున్నా వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

More News

కరోనా లిస్టులో కొత్తగా మరో మూడు లక్షణాలు

కరోనా కేసులతో పాటు లక్షణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా లక్షణాల లిస్టులో అమెరికా హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మరో మూడు లక్షణాలను చేర్చింది.

వసుధ ఫౌండేషన్ సౌజన్యంతో 'మనం సైతం' భారీ వితరణ!!

'ఆపన్నుల పాలిట అభయ హస్తం'గా మారిన కాదంబరి సారధ్యంలోని 'మనం సైతం'

ఏపీలో నేడు 800 దాటిన కరోనా కేసులు

ఏపీలో నేడు కరోనా పాజిటివ్ కేసులు 800 దాటాయి. గడిచిన 24 గంటల్లో 25వేల 778 నమూనాలను పరిశీలించగా..

జగన్‌ను కాపాడేందుకు రఘురామ కృష్ణంరాజు వచ్చాడంటూ వర్మ సంచలన ట్వీట్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో

పని పాట లేని లోకేష్ పబ్జీ ఆడుకొంటున్నాడు: రోజా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.