హీరోకు 50... హీరోయిన్‌కు 19 ఏళ్లా?: దియా మీర్జా
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలినాళ్లలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. ముఖ్యంగా దక్షిణాది చిత్రపరిశ్రమలో అవమానాలను సైతం ఎదుర్కోవాల్సి వచ్చిందని గతంలో ఒకసారి చెప్పి ప్రముఖ సినీ నటి, మోడల్ దియా మీర్జా వార్తల్లో నిలిచింది. తాజాగా ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోమారు దియా వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సినీ పరిశ్రమ పురుషాధిక్యంతో నిండిపోయిందని పేర్కొన్నారు.
19 ఏళ్ల వయసున్న హీరోయిన్ పక్కన.. 50 ఏళ్లు పైబడిన హీరో జోడీగా నటించడం విడ్డూరంగా ఉందని దియా అభిప్రాయ పడింది. అతి తక్కువ వయసున్న హీరోయిన్లతో వయసు పైబడిన హీరోలు కలిసి నటించడం దురదృష్టకరమని.. ఇదేం చోద్యమని ఆమె పేర్కొంది. వయసు పైబడిన హీరోలు యువకుడి పాత్రలో నటించడాన్ని దియా తప్పుబట్టింది. వయసు మళ్లిన నటీమణిని దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్కరూ కథలు రాయరని... వయసు పైబడిన హీరోల కోసం మాత్రం కథ రాసి.. వారిని హీరోలుగా నిలబెడుతుంటారని దియా వాపోయింది.
అందం అనేది యవ్వనంతో ముడిపడి ఉంటుందని దియా తెలిపింది. అందుకే ప్రతిసారి కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తుంటరాని తెలిపింది. నీనా గుప్తా లాంటి కొందరికి మాత్రమే వయసు పైబడినప్పటికీ ఇప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రలు దక్కుతున్నాయని దియా అభిప్రాయపడింది. కానీ.. నడి వయసు వచ్చీ రాకముందే నటీమణులకు అవకాశాలు తగ్గిపోయి చాలా ఇబ్బందులనెదుర్కొంటున్నారని తెలిపింది. కానీ హీరోలు మాత్రం తమ కంటే వయసు తక్కువున్న హీరోయిన్లతో నటిస్తూ కాలం గడిపేస్తున్నారని దియా మీర్జా అభిప్రాయపడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com