విడిపోతున్నామని ప్రకటించిన హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హీరోయిన్ దియామీర్జా తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ హైదరాబాదీ హీరోయిన్ భర్త సాహిల్ సింఘా నుండి విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. వ్యాపారవేత్త సాహిల్ సింఘాతో చాలా కాలం ప్రేమాయణం నెరిపిన దియామీర్జా 2014లో అతన్ని పెళ్లి చేసుకుంది. ఐదేళ్లు పూర్తి కాక ముందే వీరిద్దరూ తమ వివాహ బంధానికి బై బై చెప్పేసుకున్నారు.
`ఇద్దరం గత కొంతకాలంగా కలిసున్నాం. కష్టసుఖాలను పంచుకున్నాం. ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులకు, స్నేహితులకు థ్యాంక్స్. మా ప్రయాణం విభిన్న మార్గాలను ఎంచుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. విడిపోయినా స్నేహితుల్లాగానే కలుసుంటాం` అంటూ మెసేజ్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout