Dhum Masala: 'గుంటూరుకారం' నుంచి 'దమ్ మసాలా' సాంగ్ వచ్చేసింది

  • IndiaGlitz, [Tuesday,November 07 2023]

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా 'గుంటూరు కారం' చిత్రం నుంచి 'దమ్ మసాలా' ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదలైంది.

థమన్ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ పాటని పాడారు. టీజర్‌లో మహేష్ ఇప్పటివరకు కనిపించనంత మాస్‌గా కనిపించారు. దీంతో ఈ సినిమా ఫ్యాన్స్‌కు పూనకాలు తీసుకురావడం పక్కా అని అర్థమవుతుంది.

ఇక అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న 'గుంటూరు కారం' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

More News

Komatireddy Venkat Reddy: నేనూ సీఎం అవుతా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. హోరాహోరి ప్రచారంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అన్ని పార్టీలు అధికారం తమదే అంటూ తమదే అని చెబుతున్నారు.

YS Jagan: చంద్రబాబు హయాంలో అన్ని స్కాములే.. సీఎం జగన్‌ విమర్శలు..

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రైతుభరోసా నిధులను ఆయన విడుదల చేశారు.

Nara Lokesh:దక్షిణ భారత్ బీహార్‌గా ఏపీ మారింది: నారా లోకేశ్

జగన్ పాలనలో దక్షిణ భారత్ బిహార్‌గా ఏపీ మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

BJP:12 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత అభ్యర్ధుల జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది.

Chhattisgarh and Mizoram:ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలో ప్రశాంతం కొనసాగుతోన్న పోలింగ్..

లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.