'ధృవ'కు భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు - సెల్యూట్ చేసిన చిత్ర యూనిట్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, గీతాఆర్ట్స్ బ్యానర్‌పై స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నిర్మాత ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్ `ధృవ`. ఈ సినిమా డిసెంబర్ 9న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజైంది.సినిమా సక్సెస్ అయిన సందర్భంగా శుక్రవారం చిత్రయూనిట్ సెల్యూట్ టు ఆడియెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా...
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ మాట్లాడుతూ `` నేను, అల్లు అరవింద్‌గారు ధృవ సినిమా మాతృక చూసి తెలుగులో చేయాలనుకోగానే సినిమా చేయడానికి ఒప్పుకుని సినిమాను చక్కగా తెరకెక్కండానికి అంగీకరించిన తర్వాత సురేందర్‌రెడ్డిగారు సినిమాను డైరెక్ట్ చేయడం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. బాహుశా మగధీర తర్వాత మా కాంబినేషన్‌లో ఇలాంటి ఓ మంచి కథతో సినిమా రావడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. నేను, మామ అల్లు అరవింద్ సినిమా చేస్తే ఎక్కువగా ఆనందపడేది మా అమ్మగారే. ఆమె ఆనందం కోసం సినిమా పెద్ద హిట్ కావడం ఇంకా హ్యపీగా ఉంది. నా ఫ్రెండ్స్ గా చేసినవాళ్లందరికీ ధన్యవాదాలు. పోసాని చాలా మంచి పాత్ర చేశారు. హిప్ హాప్ సంగీతం చాలా బావుంది. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమా ఇంకో లెవల్‌కి వెళ్లింది. తనతో భవిష్యత్తులో పనిచేయాలని నాకు అనిపిస్తోంది. హిప్ హాప్ పాటలకు డ్యాన్స్ చేయలేక చచ్చిపోయాను. ఈ సినిమా కోసం నేను ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. పరేషాన్ పాటలో రకుల్‌ను చూసి నా అభిమానులు చొక్కాలు చించుకున్నారు. నేను నెంబర్స్ ని, సీట్లని పట్టించుకోను. వాటిని పట్టించుకుంటే కొత్త కథలు రావు. అలాగే రికార్డులను గురించి కూడా పట్టించుకోను`` అని అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ `` రిలీజ్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా మథనపడ్డాం. ఓ వైపు పెద్ద నోట్లు రద్దయ్యాయి, మరో వైపు వచ్చే నెల్లో చిరంజీవిగారి చిత్రం వస్తుంది, మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలని చాలా ఆలోచించాం. చాలా మంది సంక్రాంతి తర్వాత విడుదల చేయమన్నారు. కానీ నేను, చరణ్ కలిసి ధైర్యం చేశాం. రిస్క్ చేశాం. ఆ సమయంలో మా మనసుల్లో ఎలాంటి భావాలుంటాయో అర్థం చేసుకోండి. అలాగే ఈ ఏడాది నాకు వ్యక్తిగతంగా చాలా బావుంది. గీతాఆర్ట్స్ బ్యానర్‌లో సరైనోడుతో బన్నితో, శ్రీరస్తు శుభమస్తుతో శిరీష్ ఇప్పుడు ధృవతో చరణ్ హిట్ మూవీస్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మగధీర తర్వాత మరలా అంత పెద్ద హిట్ సినిమా చేద్దామనుకున్నాను. అది ఈ సినిమాతో కుదిరినందుకు చాలా ఆనందంగా ఉంది. చరణ్ కెరీర్‌లో టాప్ గ్రాసర్లు రెండూ గీతా ఆర్ట్స్ లోనే ఉండటం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ `` మంచి కథ ఉంటే సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుకొస్తారని మరో సారి నిరూపించిన చిత్రమిది. తమిళ్ కన్నా తెలుగు సినిమాను చూసి ఎంజాయ్ చేశామని చాలా మంది చెప్ఆరు. 50 కోట్లను దాటిన ఈ సినిమా 100 కోట్లను కూడా దాటాలి`` అని తెలిపారు.
డైరక్టర్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ `` ఈ టైమ్‌లోనూ మాకు హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్స్. ఈ సినిమాను సెలక్ట్ చేసుకోవడమే గొప్ప. చరణ్ ఈ సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యాడు. హీరో ఈ స్టెప్ తీసుకోకపోతే ఈ సినిమా వచ్చేది కాదు. ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడు సగం మంది కరెక్ట్ అన్నారు. సగం మంది వద్దన్నారు. కానీ హీరో, నిర్మాతలు నమ్మి ముందడుగేశారు. నవీన్ చాలా బాగా ఎడిట్ చేశాడు. ఈ సినిమాతో తను నాకు ఫ్రెండయ్యాడు`` అని అన్నారు.
ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ `` ఈ సినిమాను చూడగానే నేను చరణ్ దగ్గరకు వెళ్లాను. కానీ ఆయన ఈ సినిమాను తనకు ఎన్వీ ప్రసాద్ చూపించారని, ఆయనతోనే చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అలాగే దర్శకుడి గురించి వచ్చినప్పుడు కూడా సూరి గురించి చెప్పారు. తని ఒరువన్ దర్శకుడు తెలుగులోనూ ఈ సినిమాను దర్శకత్వం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చరణ్ ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. నిర్మాతలు, దర్శకులు అనుకుంటే కొత్త తరహా సినిమాలు రావు. రావాలంటే హీరోలు అనుకోవాలి. ఈ సినిమా రైట్ టైమ్‌లో విడుదలై ఉంటే ఇంకో 20 శాతం రెవెన్యూ ఎక్కువగా ఉండేది`` అని తెలిపారు.
నవదీప్ మాట్లాడుతూ `` ఏటీయం కోసం కట్టిన క్యూలన్నీ ఈ సినిమా థియేటర్లవైపు తిరిగాయి. చరణ్‌కున్న క్రేజ్ మరోసారి ఈ సినిమాతో అర్థమైంది. ఇండియన్ సినిమాలోనే కాస్ట్ ఎక్కువైన ఔట్‌డోర్ షూట్ మాదే. 200 మందితో కాశ్మీర్‌లో పెద్ద షెడ్యూల్ చేశాం. నా కెరీర్‌లో ఈ సినిమా బూస్ట్ అయింది`` అని అన్నారు.
హిప్ హాప్ తమిళ మాట్లాడుతూ `` ఈ సినిమాను ఒప్పుకోగానే బాగా చేయమని చరణ్ చెప్పారు. నాకు గీతా ఆర్ట్స్ లో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది`` అని చెప్పారు.
పోసాని మాట్లాడుతూ `` నేను నటుడిగా నాయక్ చిత్రంతో ఊపందుకున్నాను. చరణ్‌తో మరలా సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర కోసం చాలా మంది నటులు ఈ రూపకర్తలకు ఫోన్లు చేశారని తెలిసింది. కానీ దర్శకనిర్మాతల మనస్సుల్లో నేనే మొదట నిలవడం ఆనందంగా ఉంది. ఇంకో పదేళ్ల కెరీర్‌కు కావాల్సినంత మంచి పేరును ఈ సినిమా తెచ్చిపెట్టడం ఆనందంగా ఉంది`` అని అన్నారు.
ఉపేన్ మాట్లాడుతూ `` ఈ సినిమాకు పనిచేయడం చాలా ఆనందగా ఉంది. స్క్రీన్ టెస్ట్ చేసి సెలక్ట్ చేశారు`` అని అన్నారు.
అలీ మాట్లాడుతూ ``` ఈ సినిమాకు చివరిగా నన్నే సెలక్ట్ చేశారు. సర్దార్ పాత్రలో చేశాను`` అని తెలిపారు.
రణ్‌వీర్ మాట్లాడుతూ `` దర్శకుడితో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాకు కుదిరింది. గీతా ఆర్ట్స్లో నేను చేసిన రెండో చిత్రమిది`` అని అన్నారు.
వేమారెడ్డి మాట్లాడుతూ `` అందరూ సినిమాను ఇష్టపడి, కష్టపడి చేస్తారు. మేం చాలా జాగ్రత్తగా చేశాం. రామ్‌చరణ్‌గారి స్టామినా మరో సారి ప్రూవ్ అయింది`` అని అన్నారు.
రైటర్ మధు మాట్లాడుతూ `` ఇంత పెద్ద సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
చంద్రబోస్ మాట్లాడుతూ `` రామ్‌చరణ్‌గారికి ఇంతకు ముందు చాలా సినిమాలకు రాశాను. ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా. హిప్ హాప్ తమిళకు మంచి భవిష్యత్తు ఉంది`` అని అన్నారు.
వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ `` పరేషానురా పాటను రాశాను. అవకాశానికి ధన్యవాదాలు`` అని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments