'ధృవ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడంటే....

  • IndiaGlitz, [Monday,November 21 2016]

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్ టైన‌ర్ 'ధృవ‌'.

హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా పాటలు ఇటీవ‌ల ఆదిత్య మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్లోకి విడుద‌లై ఆడియెన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. సినిమా ఆడియో వేడుక కూడా గ్రాండ్‌గా నిర్వ‌హించ‌లేదు కాబ‌ట్టి, ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజ‌ర‌వుతాడు కాబ‌ట్టి మెగాభిమానులు కూడా భారీగానే వ‌స్తారు..అందుకు త‌గ్గ‌ వేదిక‌ను ప‌రిశీలిస్తున్నారు. నవంబ‌ర్ 26న ధృవ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఉండ‌బోతుంద‌ని స‌మాచారం.