ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న ధృవ ప్రీ లుక్ పోస్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ధృవ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేస్తూ ధృవ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.
చరణ్ బ్యాక్ నుంచి కనిపిస్తున్న ఈ పోస్టర్ లో ఏదో సీరియస్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ పై మై ఎనిమీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటూ ఈ మూవీ మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో రూపొందే చిత్రం అని తెలిసేలా డిజైన్ చేయడం బాగుంది. ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ప్రీ లుక్ పోస్టరే ఇలా ఇంట్రస్టింగ్ గా ఉంటే ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉంటుందో ..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments