3 రోజుల్లో మిలియన్ మార్క్ క్రాస్ చేసిన ధృవ

  • IndiaGlitz, [Monday,December 12 2016]

రామ్‌చ‌ర‌ణ్‌కి 2016 చాలా గొప్ప ఏడాదిగా మిగిలింది. ఆయ‌న కెరీర్‌లో అత్యంత భారీగా తెర‌కెక్కి విడుద‌లైన చిత్రాల్లో ధృవ ఒక‌టి. సినిమా విడుద‌లైన‌ప్పటి నుంచే అటు విమ‌ర్శ‌కుల నుంచి ఇటు ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు పొందుతోంది. మౌత్ టాక్‌తో సినిమా యునానిమ‌స్ హిట్‌గా నిలిచింది. ఓ వైపు జ‌నాలు పెద్ద నోట్ల ర‌ద్దుతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ ధృవ కు వారాంతంలో థియేట‌ర్లు హౌస్ ఫుల్స్ కావ‌డం విశేషం. సినిమా బావుంటే ఎన్ని ఇబ్బందులున్నా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న‌డానికి ధృవ‌ పెద్ద నిద‌ర్శ‌నం.
అలాగే యుఎస్‌లోనూ వాతావ‌ర‌ణం సానుకూలంగా లేన‌ప్ప‌టికీ చాలా చోట్ల థియేట‌ర్లు హౌస్ ఫుల్ అటెండెన్స్ తో క‌నిపించాయి. అంటే ధృవ కున్నక్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. కేవ‌లం మూడు రోజుల్లోనే ధృవ అక్క‌డ‌ మిలియ‌న్ డాల‌ర్స్ మార్క్ ను క్రాస్ చేసింది. రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం యుఎస్ఎ టూర్‌లో ఉన్నారు. అందులో భాగంగానే ఆయ‌న త‌న అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను క‌లుసుకుని మాట్లాడుతున్నారు.
రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ....నా ధృవ టీమ్‌తో యుఎస్ఎలో ప‌ర్య‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ను క‌లుసుకోవాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. ఇప్ప‌టికైనా అది సాకార‌మైనందుకు ఆనందంగా ఉంది. త్వ‌ర‌లో హైద‌రాబాద్‌కి చేరుకుంటాను. అక్క‌డ కూడా నా అభిమానుల స‌మ‌క్షంలో స‌క్సెస్‌ను పంచుకుంటాను. ధృవ గురించి అంద‌రూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ధ‌న్య‌వాదాలు అని అన్నారు.

More News

మ‌హేష్ కి టైటిల్ న‌చ్చ‌లేదా..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

డిసెంబర్ 18 న 'శతమానం భవతి' ఆడియో విడుదల

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

అల్లు శిరీష్ జోడీగా నిక్కి గల్రాని

తాజాగా అల్లు శిరీష్ ప్రేయసిగా నిక్కి గల్రాని నటిస్తోంది.అల్లు శిరీష్ నటిస్తున్న వార్ డ్రామా 1971:

మహేష్ సినిమాలో మరో తమిళ నటుడు...

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ప్రస్తుతం

సీరియల్ గా బాహుబలి....

తెలుగు సినిమా స్టామినాని దేశానికే కాదు,ప్రపంచానికి తెలియచెప్పిన సినిమా బాహుబలి.