ధృవ సెకండ్ షెడ్యూల్ పూర్తి...

  • IndiaGlitz, [Saturday,June 11 2016]

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా గీతాఆర్ట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ధృవ. తమిళ చిత్రం తనీ ఒరువన్ కు ఇది రీమేక్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. రాంచరణ్ ఐ.పి.యస్ ఆఫీసర్ గా కనపడబోతున్నాడు. మైండ్ గేమ్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జరుపుకుంటుంది.

సినిమా రెండో షెడ్యూల్ కూడా పూర్త‌య్యింది. నెక్ట్స్ షెడ్యూల్ కాశ్మీర్‌లో ప్రారంభం కానుంది. రాంచ‌ర‌ణ్‌తో ప‌నిచేయ‌డం చాలా మంచి అనుభూతినిచ్చింద‌ని, సెట్‌లో ప్ర‌తి ఒక్కరు చాలా ఎన‌ర్జిటిక్ గా ఉన్నార‌ని డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కూడా తెలియ‌జేశారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.