Tamil »
Cinema News »
నన్ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన అల్లు అరవింద్ గారు - చరణ్ కోసం ధృవ విజయం సాధించాలి - సూర్య
నన్ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన అల్లు అరవింద్ గారు - చరణ్ కోసం ధృవ విజయం సాధించాలి - సూర్య
Sunday, December 4, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం సింగం-3. సింగం సిరీస్‌లో మూడవ చిత్రంగా రూపొందిన సింగం 3 చిత్రాన్ని హరి తెరకెక్కించారు. ఈ చిత్రంలో సూర్య సరసన అనుష్క, శృతిహాసన్ నటించారు. తమిళ్ లో ప్రముఖ నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 23న సింగం 3 చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో రచయిత వెన్నెలకంటి శశాంక్ మాట్లాడుతూ...సింగం 3 టీజర్ హండ్రడ్ వాలా అయితే...మూవీ థౌంజడ్ వాలాలా ఉంటుంది. సింగం, సింగం 2 చిత్రాలు సక్సెస్ అవ్వడంతో సింగం 3 పై అంచనాలు భారీ స్ధాయిలో ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం అంత ఈజీ కాదు. కానీ...హరి గారు అందరి అంచనాలకు తగ్గట్టు తెరకెక్కించారు. 100% అంచనాలను సింగం 3 రీచ్ అవుతుంది. ఈ చిత్రంలో సూర్య క్యారెక్టర్ ఒక కొడుకుగా, ప్రేమికుడుగా, పోలీస్ గా ఇలా అన్నింటిలో బెస్ట్ అనేలా ఉంటుంది. అది ఆడియోన్స్ కి బాగా రీచ్ అయ్యింది. అన్నివర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ... సింగం, సింగం 2 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక సింగం 3 సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రాన్ని ఈనెల 23న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీతో సూర్య పవర్ ప్రపంచ వ్యాప్తంగా తెలుస్తుంది. సింగం 4 కూడా చేయాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
విలన్ పాత్రధారి అనూప్ మాట్లాడుతూ... నాకు తమిళ్ రాదు. అయినా డైరెక్టర్ హరి, హీరో సూర్య గైడెన్స్ తో ఈ చిత్రంలో నటించాను. నా క్యారెక్టర్ కు న్యాయం చేసాను అనుకుంటున్నాను అన్నారు.
నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ... సూర్య గారు అంటే నాకు అభిమానం. సింగం 3 మూవీతో అసోసియేట్ అవ్వాలి అని 24 మూవీ టైమ్ నుంచి ప్రయత్నిస్తున్నాను. నన్ను నమ్మి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన సూర్య గార్కి, నిర్మాత జ్ఞానవేల్ రాజా గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. శాటిలైట్ రైట్స్ ను కూడా ప్రముఖ ఛానల్ కి ఇవ్వడం జరిగింది. ఈనెల 23న భారీ స్ధాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
హీరో సూర్య మాట్లాడుతూ... జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ సంస్థ ప్రారంభించి పది సంవత్సరాలు అయ్యింది. నాకోసం, కార్తీ కోసం ఈ సంస్థ ప్రారంభించి మాకు ఎంతగానో సపోర్ట్ అందిస్తున్న జ్ఞానవేల్ రాజాకి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. అలాగే తెలుగులో నన్ను లాంఛ్ చేసింది అల్లు అరవింద్ గారు. ఆయన నిర్మాణంలో రూపొందిన ధృవ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు జరుగుతుంది. రెండు సినిమాలకు వారం గ్యాప్ ఉంటే మంచిది అనే ఉద్దేశ్యంతో సింగం 3 వాయిదా వేసాం. ధృవ విజయం సాధించాలి అని కోరుకుంటూ ఈ సందర్భంగా రామ్ చరణ్, అల్లు అరవింద్ గార్కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను.
ఇక సింగం 3 విషయానికి వస్తే...హరితో నాకు ఇది 5వ సినిమా హరీస్ జైరాజ్ తో 8వ సినిమా. నరసింహ క్యారెక్టర్ లో మరోసారి బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. సింగం 2 సింగం 3 చేస్తామని అనుకోలేదు. ఫ్యాన్స్, వెల్ విషర్స్ అందరూ సింగం 3 చేస్తే బాగుంటుంది అనడం...హరి దీనికి తగ్గట్టు మంచి పాయింట్ చెప్పడంతో ఈ మూవీ చేసాం. ఈ చిత్రం బెంగుళూరు నేపధ్యంలో జరుగుతుంది కానీ...90% షూటింగ్ వైజాగ్ లో చేసాం. సింగం, సింగం 2 టీమ్ తోనే సింగం 3 కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు తమ సొంత సినిమాలా ఎంతో శ్రద్దతో వర్క్ చేసారు. టీమ్ మెంబర్స్ ఇంట్రస్ట్ చూసి నాలో మరింత ఉత్సాహం పెరిగింది.
సింగం 2 లో హన్సిక క్యారెక్టర్ ను సింగం 3 లో శృతిహాసన్ చేసింది. 24 సినిమాకి తెలుగు ప్రేక్షకులు చూపించిన ఆదరణను మరచిపోలేను. ఈ చిత్రంలో విలన్ గా నటించిన అనూప్ భాష తెలియకపోయినా పాత్రకు తగ్గట్టు అద్భుతంగా నటించారు. అనూప్ ఏక్టింగ్ చూసి యూనిట్ మెంబర్స్ క్లాప్స్ కొట్టేవారంటే ఎంత బాగా నటించాడో అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని మంచి ప్రమోషన్స్ తో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న నిర్మాత శివకుమార్ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ... సింగం 3 తమిళ వెర్షెన్ ఆడియోను ఈనెల 13న, తెలుగు వెర్షెన్ ఆడియోను ఈనెల 11న రిలీజ్ చేయనున్నాం. ఇక చిత్రాన్ని ఈనెల 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాం. డైరెక్టర్ హరి డే & నైట్ వర్క్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే శశాంక్ మంచి సంభాషణలు అందించాడు. పదేళ్లుగా మా జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments