హీరోయిన్‌తో విక్రమ్ తనయుడు ప్రేమాయణం.. దుబాయ్‌లో చక్కర్లు, ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ పరిశ్రమకు , రూమర్లకు అవినాభావ సంబంధం వుంటుంది. ఎక్కడి నుంచి వస్తాయో, ఎలా పుడతాయో తెలియదు కానీ కొన్ని గాలివార్తలకు జనంలో అటెన్షన్ ఎక్కువగా వుంటుంది. ఫలానా హీరోయిన్ .. ఆ హీరోతో క్లోజ్‌గా వుందనో, ఆ దర్శకుడు ఓ హీరోయిన్‌తో అఫైర్ నడుపుతున్నాడనో రకరకాల కథనాలను వండి వారుస్తూంటారు పుకారు రాయుళ్లు. వీటికి ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వని పక్షంలో ఆ వార్తలు చక్కర్లు కొడుతూనే వుంటాయి.
ఈ సంగతి పక్కనబెడితే.. తమిళ విలక్షణ నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ .. బ్రిటిష్ బ్యూటీ బనితా సంధుతో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా తమళ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు.. ఈ రూమర్లకు బలాన్నిస్తూ ధ్రువ్- బనితాలు క్లోజ్‌గా వున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలను ఈ జంట దుబాయ్‌లో సెలబ్రేట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఓ హోటల్ రూం బాల్కానీలో బనిత నిలబడిన ఫొటోను షేర్ చేస్తూ ‘హ్యాపీ న్యూ ఇయర్’ విషెస్ చెప్పాడు ధ్రువ్. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రేమికుల ఫొటోలను రీట్వీట్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.
కాగా.. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి రీమేక్ ‘ఆదిత్య వర్మ’తో కోలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్. ఇందులో బనితా సంధు హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం ధ్రువ్ ‘మహాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బనిత విషయానికి వస్తే.. ‘హూవీ’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత విక్కీ కౌశల్ ‘సర్దార్ ఉద్దమ్’లో నటించారు. ప్రస్తుతం ‘కవిత అండ్ థెరిసా’ సినిమాలో బనిత నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments