LGM:‘ఎల్జీఎం’ (LGM - Lets Get Married)... ఆగస్ట్ 4న భారీ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
కుటుంబంలోని మనుషులు అందరూ ఒకేలా ఉండాలనేం లేదు.. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. దీని వల్ల మనస్పర్దలు వస్తుంటాయి..పోతుంటాయి. కానీ బంధాలు, బంధుత్వాలను మనం విడిచి పెట్టలేం. ముఖ్యంగా కొత్త పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి, అమ్మాయిలకు మనసులో తెలియని భయాలు ఎన్నో ఉంటాయి. మరీ ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య ఉండే రిలేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా మనసుకి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కాబోయే అత్తగారి గురించి భయపడుతుంది. అందు కోసం ఆమెతో కలిసి కొన్ని రోజుల పాటు ఆమెతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటుంది. అందుకు ఒప్పుకున్న అత్తా కోడళ్ల మధ్య ఉండే కండీషన్స్ ఏంటి? చివరకు వారిద్దరూ మనస్తత్వాలు కలిశాయా? అనే వైవిధ్యమైన పాయింట్‌తో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎల్జీఎం’ (LGM - Lets Get Married). ఆగస్ట్ 4న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్.ఫిల్మ్స్, త్రిపుర ప్రొడక్షన్స్ బ్యానర్స్ భారీ లెవల్లో విడుదల చేస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియాలే ఈ సినిమాకు ప్రధాన బలం. పెళ్లికి ముందే కాబోయే అత్తగారికి కండీషన్స్ పెట్టిన గడుసరి కోడలుగా ఇవానా కనిపిస్తుంది. లవ్ టుడే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఇవానా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె నటన ఎలా ఉండబోతుందనేది ట్రైలర్లో చిన్న టచ్‌తో చూపించించారు దర్శకుడు రమేష్ తమిళ్ మణి. ఇక కొడుకు ప్రేమ కోసం కోడలి పెట్టిన కండీషన్స్‌ను ఒప్పుకుని ఆమెతో ట్రావెల్ చేసే తల్లి పాత్రలో నదియా నటించారు. ఎన్నో చిత్రాల్లో తల్లి, అత్త.. వంటి వైవిధ్యమైన క్యారెక్టర్స్‌లో మెప్పించిన నదియా గురించి తెలుగు ఆడియెన్స్‌కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇటు కాబోయే భార్య.. ప్రేమగా పెంచుకున్న తల్లి మధ్య భావోద్వేగాలతో నలిగిపోతూ ఇబ్బంది పడే అబ్బాయిగా హరీష్ కళ్యాణ్ నటించారు. ఇక సినిమాలో యోగిబాబు తనదైన కామెడీతో నవ్వించనున్నారు.
ఇండియన్ లెజెండ్రీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని ‘ఎల్జీఎం’ (LGM - Lets Get Married)తో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ఈ సినిమాను ధోని ఎంటర్టైన్మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 4న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments