'దిమాక్ ఖ‌రాబ్...' వీడియో సాంగ్ దూకుడు

  • IndiaGlitz, [Saturday,September 21 2019]

'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఈ సినిమాపై విడుద‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా పెద్ద‌గా అంచ‌నాలు లేవు. ఎందుకంటే అటు హీరో రామ్‌కైనా.. ఇటు డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్‌కైనా స‌క్సెస్‌లు లేవు. అయితే బంతి కింద ప‌డితే అలాగే పైకి లేస్తుంది. ఈ రీతిలోనే పూరి జ‌గ‌న్నాథ్ 'ఇస్మార్ట్ శంక‌ర్‌'తో హిట్ కొట్టాడు. సినిమా చాలా హ్యూజ్ హిట్ట‌య్యింది. రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. పూరి టేకింగ్‌కి రామ్ ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్‌, హీరోయిన్స్ న‌భా న‌టేశ్‌, నిధి అగ‌ర్వాల్ గ్లామ‌ర్ తోడు కావ‌డంతో సినిమాకు మాస్ ఆడియెన్స్ మాంచి క్రేజ్ వ‌చ్చింది. సాంగ్స్ విష‌యానికి వ‌స్తే.. సినిమాలో పాట‌లు బావున్నాయని అన్నారు.

అంతేలా తెర‌పై కూడా ప్రేక్ష‌కులు ఆస్వాదించారు. ముఖ్యంగా దిమాక్ ఖ‌రాబ్ వీడియో సాంగ్‌కైతే ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సాంగ్‌ను శుక్ర‌వారం చిత్ర యూనిట్ యూ ట్యూబ్‌లో విడుద‌ల చేసింది. యూ ట్యూబ్‌లోనూ ఈ సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. సాంగ్ విడుద‌లైన 17 గంట‌ల్లోనే 3 మిలియ‌న్ వ్యూస్‌ను దాటేయ‌డం విశేషం. శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌రీతులు, రామ్‌, న‌భా, నిధి పెర్ఫామెన్సులు ఈ పాట‌కు మెయిన్ హైలైట్.

పూరి అంటే మాస్.. ఈ సినిమాలోనూ హీరో రామ్‌ను పూరి మాస్ యాంగిల్‌లో ఆవిష్క‌రించాడు. పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు ఛార్మితో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

More News

అక్టోబర్ 18 న  కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ విడుదల

బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం  'కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్'.

ఎంపీ ఎఫెక్ట్.. ‘ఆదీ’.. మాకొద్దంటున్న బీజేపీ.. !?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి చెందిన పలువురు సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, కీలకనేతలు ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

రేవంత్ నాకు ముద్దుల అన్నయ్య.. జనసేనకు సింగిల్ సర్పంచ్ లేరే!?

రేవంత్.. రేవంత్.. రేవంత్.. గత కొన్ని రోజులుగా ఈ ఫైర్‌బ్రాండ్ పేరు తెలంగాణ రాజకీయాల్లో గట్టిగానే వినపడుతోంది.

పెళ్లి చేసుకోవాలంటే ట్రై చేయండి.. కాజల్ రిప్లై!

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా సినీ ఇండస్ట్రీనే ఏలేస్తోంది కాజల్ అగర్వాల్..

సచివాలయ ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రభుత్వం క్లారిటీ.. అరెస్ట్‌లు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన జరిపిన గ్రామ సచివాలయ పరీక్షా పత్రాలు లీకైనట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.