'దీర్ఝ ఆయుష్మాన్ భవ' టైటిల్ లొగొ విడుదల

  • IndiaGlitz, [Wednesday,December 20 2017]

వింగ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా జి.ప్రతిమ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే‌.ఎం.పూర్ణానంద్‌ ఈ చిత్రానికి దర్శకుడు‌. సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతొన్న ఈ చిత్రానికి "దీర్ఘ ఆయుష్మాన్ భవ" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్ర టైటిల్ లొగొను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది‌.

ఈ సందర్బంగా హీరో కార్తీక రాజు మాట్లాడుతూ..హీరోగా నా గత చిత్రాల కంటే‌ వైవిధ్యంగా ఉండే సినిమా దీర్ఝ ఆయుష్మాన్ భవ డైరెక్టర్‌ పూర్ణానంద్‌గారు ఓ గమ్మత్తెన ప్రేమకథ గా రూపొంది స్తున్నారు. "దీర్ఝ ఆయుష్మాన్ భవ" ఈ కథకు కరెక్ట్ టైటిల్ అన్నారు.

దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ - "ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా తీస్తొన్న సోషియో ఫాంటసీ ప్రేమకథాచిత్రమ్‌ "దీర్ఝ ఆయుష్మాన్ భవ". సినిమా ఆద్యంతం ఫ్రెష్‌లుక్‌తో ఉంటుంది. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ గారు ఓ కీలక పాత్రలొ చాలా రోజుల అనంతరం మా చిత్రంలొ నటిస్తుండటం విశేషం. మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది‌. గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరిలొ‌ సినిమాను విడుదల చెయనున్నాము. 'దీర్ఝ ఆయుష్మాన్ భవ' అని టైటిల్ మా సినిమాకు పర్ఫెక్ట్ అని సినిమా చూసినవా రంటారన్నారు.

హీరోయిన్‌ మిస్తి చక్రవర్తి మాట్లాడుతూ - "నేటి తరం ప్రేమకథల్లొ ఇదోక విభిన్నమైన కథాకథనాలతో తెరకెక్కుతొన్న లవ్ స్టొరీ ఇది. నా పాత్ర కు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుందన్నారు.

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, నొయల్, కైకాల సత్యనారాయణ, ఆమని, పృథ్వీరాజ్‌, కాశి విశ్వనాధ్, సత్యం రాజేష్, నొయల్, తాగుబొతు రమేష్, గెటప్ శీను, రాం ప్రసాద్, కేదార్ శంకర్, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, మాటలు: ప్రదీప్‌ ఆచార్య, పూర్ణానంద్‌.ఎం, ఆర్ట్‌: రామకృష్ణ, నిర్మాత: ప్రతిమ.జి, కథ, కథనం, దర్శకత్వం: పూర్ణానంద్‌.ఎం.

More News

'2 కంట్రీస్' సెన్సార్ పూర్తి

సునీల్, మ‌నీషా రాజ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం '2 కంట్రీస్‌'. మ‌హాల‌క్ష్మి ఆర్ట్స్ ప‌తాకంపై ఎన్‌.శంక‌ర్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో సినిమాను రూపొందించారు.

'ఇండియన్ 2' సినిమాకు సంగీత దర్శకుడెవరో తెలుసా?

శంకర్ సినిమాలకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు.

నెల రోజుల గ్యాప్ లో ఆరు చిత్రాలు

యువ సంగీత దర్శకుడు తమన్ కి ఈ ఏడాది చెప్పుకోదగ్గ ఫలితాన్నేఇచ్చింది.

హ్యాట్రిక్ అయితే కొట్టారు కానీ..

అనుపమ పరమేశ్వరన్,మెహరీన్,నివేదా థామస్..2016లో తెలుగు తెరకు పరిచయమైన కథానాయికల పేర్లు ఇవి.

'మన్మథుడు' కి 15 ఏళ్లు

అక్కినేని నాగార్జున కెరీర్ లో.. ప్రత్యేకంగా నిలిచిన చిత్రాలలో మన్మథుడు ఒకటి.