ఎప్పటికైనా దర్శకుడినవుతా - ధర్మేంద్ర కాకరాల

  • IndiaGlitz, [Monday,November 13 2017]

జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై యాంగ్రీ యంగ్ మేన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో డా.రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'. పూజా కుమార్‌, శ్ర‌ద్ధాదాస్‌, కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్వ‌క‌త్వంలో కోటేశ్వ‌ర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబ‌ర్ 3న విడుద‌లైన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించింది. ఈ సంద‌ర్భంగా చిత్ర ఎడిట‌ర్ ధ‌ర్మేంద్ర కాక‌రాల సినిమా గురించి చెప్పిన విశేషాలు...

సినీ ప్ర‌యాణం గురించి..

నేను తేజ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఒక విచిత్రం' సినిమాకు శంకర్‌గారి దగ్గర పని చేశాను. ఆ తర్వాత దాసరి గారి దగ్గర ఐదారు సినిమాలు చేశాను. ఆదివిష్ణు', మైసమ్మ ఐపీఎస్‌', మేస్త్రీ' తదితర సినిమాలకు అసోసియేట్‌ ఎడిటర్‌గా చేశాను. ఆ తర్వాత ప్రస్థానం'లో అవకాశం వచ్చింది. శ్రీకర్‌ ప్రసాద్‌, శంకర్‌గారు నాకు స్ఫూర్తి. ఎడిటింగ్‌లో వాళ్లు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. వాళ్ల సినిమాల ఎడిటింగ్‌ సాధారణంగా ఉండదు. వాళ్ల అడుగుజాడల్లోనే నేను నడుస్తున్నాను. గతంలో రామ్‌గోపాల్‌వర్మ, తేజ, కృష్ణవంశీ దగ్గర పని చేశాను. కాబట్టి ఆటోమేటిక్‌గా వర్మ స్టైల్‌ కనిపిస్తుంది.

అది డైరెక్ష‌న్ టీం ఆలోచ‌న‌....

సాధార‌ణంగా ఓ సినిమా ఎంత నిడివి ఉండాలి అనేది ఒక్క ఎడిటర్‌ నిర్ణయం కాదు. ఆ సినిమా బృందంలో చాలామంది ఈ విషయంలో ఆలోచిస్తారు. ఓ సీన్‌లో యాక్టర్‌ ఎప్పుడు డైలాగ్‌ చెప్పాలి, ఎక్కడ కట్‌ చేయాలనేది ఎడిటర్‌ చూసుకుంటాడు. కానీ సినిమా నిడివి డైరక్షన్‌ టీమ్‌ ఆలోచనల్లో ఉంటుంది.

అందువ‌ల్లే క్వాలిటీ క‌న‌ప‌డుతుంది..

'పిఎస్‌వి గ‌రుడవేగ 126.18ఎం' మూవీని 4కె రిజల్యూషన్‌లో ఎడిట్‌ చేశాం. ఆ తర్వాత దాన్ని 2కెకి మార్చి థియేటర్లకు ఇచ్చాం. దాని వల్ల నాణ్యత ఎక్కువగా కనిపిస్తోంది.బాహుబలి' తర్వాత తెలుగులో 4కె రిజల్యూషన్‌ సాంకేతికత వాడింది ఈ సినిమాకే. ఇందుకు కారణం నిర్మాత‌గారే. ఆయ‌న ప్రేక్ష‌కుడికి క్వాలిటీ మూవీని చూపించాల‌నుకున్నారు. అందుకే డబ్బుకు వెనుకాడ‌కుండా 4కె క్వాలిటీతో సినిమా చేశాం.ముఖ్యంగా యాక్ష‌న్ సీన్స్ కోసం 8 నుండి 9 కెమెరాలు ఉప‌యోగించాం. వీటిలో ఎక్కువ శాతం 4కె సాంకేతికతలోనివే.

చాలా ఎక్కువ రోజులు ప‌నిచేశాం..

గ‌రుడ‌వేగ సినిమా కోసం 2,220 గంటలు పని చేశామంటే నమ్మగలరా... మొత్తం 195 రోజులపాటు ఈ సినిమా ఎడిటింగ్‌ కోసం పని చేశాం.

ద‌ర్శ‌క‌త్వం అంటే ఆస‌క్తి..

నాకు దర్శకత్వం అంటే చాలా ఆసక్తి. అసలు ఇక్కడికి దర్శకుడిని అవుదామనే వచ్చాను. కానీ ఇప్పుడు ఎడిటర్‌గా మారాను. అయితే ఎప్ప‌టికైనా దర్శకుడినవుతా. క్రైమ్‌-కామెడీ సినిమాలు చేయాలని ఉంది. ఈ జోనర్‌ చిన్న చిన్న స్టోరీలు కూడా సిద్ధం చేసుకున్నాను. అన్నీ కుదిరితే వీలైనంత త్వరలో సినిమా ప్రారంభిస్తా.

తేడాల‌క్క‌డే ...

నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌ల్లో సినిమా ఫిలిం నుండి డిజిట‌ల్‌లో మారుతుంది. అందుల్ల నేను ఫిల్మ్‌, డిజిటల్‌ మోడ్‌లో శిక్షణ తీసుకున్నాను. డిజిటల్‌ వల్ల మాన్యువల్‌ వర్క్‌ తగ్గింది తప్ప.. ఆలోచనల పరంగా ఏం మార్పులేదు. అయితే ఫిలింలో సినిమా చూస్తున్నప్పుడు కలిగే ఎక్స్‌పీరియన్స్ ..డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్ కంటే బావుంటుంది. ఎందుకంటే, ఫిలింలో చిత్రీకరించినప్పుడు డెప్త్‌ ఎక్కువగా ఉండి బొమ్మ నాణ్యత ఎక్కువగా ఉండేది. అదే డిజిటల్‌ దగ్గరికి వచ్చేసరికి డెప్త్‌ తగ్గింది. అందుకే నాణ్యత కూడా తక్కువ కనిపిస్తోంది.

త‌దుప‌రి చిత్రాలు..

ప్ర‌వీణ్ స‌త్తారుగారు చేయ‌బోయే పుల్లెల గోపీచంద్ చేయ‌బోతున్నాను. సినిమా మే ప్రారంభం అవుతుంది. త‌ర్వాత శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌లో సినిమా చేస్తాను.

More News

క‌న్‌ఫ‌ర్మ్ చేసిన ర‌కుల్‌

తెలుగులో అన‌తికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఢిల్లీ డాళ్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఇక్క‌డ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ మ‌హారాజ్ ర‌వితేజ వంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో సినిమాలు చేసింది.

పెంకి అమ్మాయిగా రెజీనా

పిల్లా నువ్వు లేని జీవితం, ప‌వ‌ర్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, జో అచ్యుతానంద వంటి విజ‌యవంత‌మైన చిత్రాల్లో సంద‌డి చేసిన యువ క‌థానాయిక రెజీనా. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోతున్న ఈ చెన్నై చిన్న‌ది.. ప్ర‌స్తుతం నారా రోహిత్‌కి జోడీగా బాల‌కృష్ణుడు చిత్రం చేస్తోంది.

సుధీర్‌తో అదితి.. డౌట్‌లో ప‌డింది

జెంటిల్‌మాన్‌, అమీతుమీ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ని సొంతం చేసుకున్నారు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. ప్ర‌స్తుతం ఆయ‌న యువ క‌థానాయ‌కుడు సుధీర్‌బాబుతో ఓ సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

ఒకే హీరోయిన్‌తో నాగ‌శౌర్య రెండు చిత్రాలు

ఊహ‌లు గుస‌గుస‌లాడే, క‌ళ్యాణ వైభోగ‌మే, జో  అచ్యుతానంద చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

'భ‌ర‌త్ అను నేను' లోనూ అలాగే..

ర‌చ‌యిత నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన కొరటాల శివ.. వ‌రుస విజ‌యాల‌తో అన‌తి కాలంలోనే టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్.. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌తోనే త‌న సినిమాల‌ను చేసిన శివ‌.. త‌న నాలుగో చిత్రాన్ని కూడా మ‌రో స్టార్ హీరోతో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.