అచ్చెన్నా.. మంత్రి రాజీనామాకు రెడీ.. మరి మీరు..!?

  • IndiaGlitz, [Saturday,November 16 2019]

‘ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్టు రుజువు చేసినా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను.. అంతేకాదు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను’ అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు. ఇసుక విషయంలో అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంత్రిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లిలో ఇసుక వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ను ధర్మాన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చెన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. మరి అచ్చెన్న రియాక్షన్ ఎలా ఉంటుందో..? ఆయన ఏ మాత్రం నిరూపిస్తారో..? ఒక వేళ నిరూపిస్తే మంత్రిగారు ఏ మేరకు రాజీనామా చేస్తారో..? మంత్రిగారయితే రెడీగా ఉన్నారు.. మరి అచ్చెన్న సంగతేంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

ఇదిలా ఉంటే.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇసుక కొరతపై దీక్ష చేప్టటిన నాడు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్యనేతలు స్పీచ్‌లు దంచికొట్టి.. ఇసుకాసురులు అంటూ ఓ జాబితాను సైతం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ఆ జాబితాలోని మంత్రులు, వైసీపీ నేతలు రియాక్ట్ అవుతూ కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు.