'ధర్మయోగి' (దిలీడర్) పాటల విడుదల

  • IndiaGlitz, [Saturday,October 22 2016]

'రఘువరన్‌ బి.టెక్‌' చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో ధనుష్‌ తాజాగా 'రైల్‌' చిత్రంతో ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చారు. ఈ దీపావళికి మరో డిఫరెంట్‌ మూవీతో ధనుష్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన 'కొడి' చిత్రంలో తొలిసారి ధనుష్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం 'ధర్మయోగి'(ది లీడర్‌) పేరుతో తెలుగులో విడుదల కానుంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌ల‌ను హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం విడుద‌ల చేశారు. హీరో ధ‌నుష్ పాట‌ల సీడీని విడుద‌ల చేశారు.

నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ - ''ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన 'కొడి' చిత్రంపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. తెలుగులో ధనుష్‌కి వున్న ఫాలోయింగ్‌ అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో ధనుష్‌ చేసిన రెండు క్యారెక్టర్స్‌ పూర్తి విభిన్నంగా వుంటాయి. ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం. . సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'కబాలి' చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో 500కి పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నాం. త్రిష ఈ సినిమా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో చేస్తోంది. ఈ చిత్రం పెద్ద హిట్‌ అయి మా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌కి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

ధ‌నుష్ మాట్లాడుతూ - ''తెలుగు వెర్ష‌న్ ధ‌ర్మ‌యోగి సినిమా కోసం వ‌ర్క్ చేసిన టెక్నిషియ‌న్స్‌కు సినిమాను విడుద‌ల చేస్తున్న డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు థాంక్స్‌. నా కెరీర్‌లో తొలిసారిగా డ్యూయెల్ రోల్ చేశాను. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది. ముఖ్యంగా ప్యామిలీ ఆడియెన్స్‌ను అల‌రించే చిత్రం. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సాంగ్స్‌, సినిమా అంద‌రికీ న‌చ్చుతాయి. దీపావ‌ళికి అంద‌రినీ క‌లుస్తాను.

కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - ''ధ‌నుష్ ఏ లాంగ్వేజ్‌లో సినిమా చేసినా స్ట్రయిట్ సినిమాలాగానే ఉంటుంది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా, కంటెంట్ ప‌రంగా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. రియాలిటీతో కామన్ మేన్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమాలు చేస్తారు ధ‌నుష్‌. దీపావ‌ళికి రిలీజ్ అవుతున్న ధ‌ర్మ‌యోగి నిర్మాత‌ల‌కు, ధ‌నుష్‌, త్రిష స‌హా టీంకు ఆల్ ది బెస్ట్‌'' అన్నారు.

ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ - ''ధ‌నుష్ చాలా ఎన‌ర్జిటిక్ స్టార్‌. వై దిస్ కొల‌వెరి సాంగ్ రిలీజ్ అయిన త‌ర్వాత ధ‌నుష్ క్రేజ్ విప‌రీతంగా పెరిగిపోయింది. గ్రేట్ న‌టుడు. నిర్మాత స‌తీష్‌గారికి ధ‌ర్మ‌యోగి సినిమా మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ''ధ‌ర్మ‌యోగి అనే టైటిల్ చాలా బ్రిలియెంట్‌గా ఉంది. ధ‌నుష్ గారి గ‌డ్డం గెట‌ప్ నాకు బాగా న‌చ్చింది. ధ‌నుష్‌కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబ‌ట్టి ఆయ‌న తెలుగులో కూడా స్ట్ర‌యిట్ మూవీ చేయాల‌ని కోరుకుంటున్నాను. ధ‌ర్మ‌యోగి మంచి స‌క్సెస్ చేస్తుంది. నిర్మాత స‌తీష్‌కుమార్‌గారికి, ద‌ర్శ‌కుడు స‌హా మిగ‌తా టీంకు అభినంద‌న‌లు'' అన్నారు.

మల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ - ''నిర్మాత స‌తీష్‌కుమార్‌గారితో మంచి ప‌రిచ‌యం ఉంది. సినిమా బావుండటం, స‌తీష్‌కుమార్‌గారితో మంచి అనుబంధం ఉండ‌టంతో సినిమాను నైజాంలో విడుద‌ల చేస్తున్నాను. ధ‌నుస్ తొలిసారి డ‌బుల్ రోల్ చేస్తున్నారు. ధ‌ర్మ‌యోగి సినిమా ధ‌నుష్‌గారికి, స‌తీష్‌గారికి మంచి పేరును, డ‌బ్బును తెచ్చి పెట్టే సినిమా అవుతుంద‌ని భావిస్తున్నాను'' అన్నారు.

వంశీ మాట్లాడుతూ - ''ధ‌ర్మ‌యోగి సినిమా పాట‌లు విన్నాను. అన్నీ బాగా న‌చ్చాయి. ఈ సినిమా చూడాల‌నే ఆస‌క్తి క‌లిగింది. ధ‌నుష్‌కు, స‌తీష్‌కుమార్ సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.

డైరెక్ట‌ర్ శ‌శిభూష‌ణ్ మాట్లాడుతూ - ''ధ‌నుష్ అణువు లాంటి వ్య‌క్తి. ఆయ‌న‌లో మాగ్న‌టిక్ ప‌వ‌ర్ అంత‌లా అంద‌రినీ ఆక‌ర్షిస్తుంది. ర‌జ‌నీకాంత్‌లోని ప‌వ‌ర్‌ను మ‌ళ్లీ మ‌నం ధ‌నుష్‌గారిలో చూడ‌వ‌చ్చు. మంచి న‌టుడు. సాంగ్స్ వండ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. ధ‌నుష్‌గారు డ్యూయెల్ రోల్ చేసిన ధ‌ర్మ‌యోగి దీపావ‌ళి హంగామాతో క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్టుకోవాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రామ‌జోగ‌య్య శాస్త్రి, సంతోషం సురేష్ కొండేటి స‌హా అతిథులంద‌రూ చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.

ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్‌ ఎస్‌., ఎడిటింగ్‌: ప్రకాష్‌ మబ్బు, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్‌.సతీష్‌కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌.

More News

బుల్లెట్ పై బాలయ్య..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

తను వచ్చెనంట మూవీ రివ్యూ

ఒకవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాపులారిటీ సంపాదించుకున్న రేష్మీ గుంటూరు టాకీస్తో వెండితెరపై కూడా తన గ్లామర్ తో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పుడు హర్రర్ చిత్రాల హవా నడుస్తున్న ఈ తరుణంలో జాంబీ థ్రిల్లర్ సినిమాలు కూడా రావడం స్టార్టయ్యింది.

తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి ప్రభాస్

టాలీవుడ్ హీ మేన్....

ఇజం కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఫస్ట్ డే హయ్యస్ట్ షేర్..!

డేరింగ్ హీరో కళ్యాణ్ రామ్,డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇజం.

హాట్ స్టార్ తో సంపూ సెన్సేషన్..!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం కొబ్బరిమట్ట.