ధనుష్ వెర్సెస్ శివ కార్తికేయన్
Friday, October 21, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రఘువరన్ బి.టెక్' చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ధనుష్. తమిళ్ లో ధనుష్ నటించిన కోడి అనే టైటిల్ తో రూపొందిన చిత్రాన్ని ధర్మయోగి అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్ నటించారు.
ఇక శివ కార్తికేయన్ నటించిన చిత్రం రెమో. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ సరసన నేన శైలజ ఫేమ్ కీర్తి సురేష్ నటించింది. భాక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ధనుష్ నటించిన ధర్మయోగి, శివకార్తికేయన్ రెమో ఈ రెండు చిత్రాల ఆడియో వేడుకలు హైదరాబాద్ లో ఒకే రోజు, ఒకే వేదికలో రిలీజ్ అవుతుండడం విశేషం. ధనుష్, శివ కార్తికేయన్ వీరిద్దరి మధ్య కోలీవుడ్ లో పోటీ నడుస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ లో కూడా పోటీపడుతుండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments