'వీఐపీ2' వాయిదా పడింది..!
Send us your feedback to audioarticles@vaarta.com
ధనుష్ హీరోగా నటించిన `వీఐపీ2` విడుదల వాయిదా పడింది. అమలాపాల్ హీరోయిన్గా నటించిన సినిమా ఇది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ధనుష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 28న `వీఐపీ2`ను విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదలను ఆగస్ట్ మొదటివారానికి వాయిదా వేశారు.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. వండర్బా ఫిల్మ్స్, వీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా వాయిదా విషయాన్ని సౌందర్య రజనీకాంత్ కూడా తన ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ధనుష్ అభిమానులు సంయమనంతో అర్థం చేసుకుంటారని ఆమె అందులో పేర్కొన్నారు. వేలై ఇల్లాద పట్టదారి సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కాజోల్ ఇందులో కీలక పాత్ర పోషించిన విషయం కూడా తెలిసిందే. రీతు వర్మ, సముద్రఖని, శరణ్య పొన్ వణ్ణన్ ఇతర పాత్రల్లో నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com