ధనుష్ విఐపి 2 ప్రారంభం..!
Thursday, December 15, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ధనుష్ హీరోగా సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న విఐపి 2 చిత్రం ఈరోజు ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ధనుష్ వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్ తో కలిసి వి క్రియేషన్స్ అధినేత కలై ఫులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.ధనుష్ పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ రజనీకాంత్ క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులకు ఆశీస్సులు అందించారు.
ఈ సందర్భంగా ధనుష్ ట్విట్టర్ లో స్పందిస్తూ... ఇంతకు మించి ఏం అడగగలను. థ్యాంక్స్ తలైవా. మీ అందరి ఆశీస్సులతో ఈరోజు షూటింగ్ ప్రారంభమైంది. రఘువరన్ ఈజ్ బ్యాక్ అంటూ ప్రారంభోత్సవం ఫోటోలను పోస్ట్ చేసారు. ఈ చిత్రానికి స్టోరీ - డైలాగ్స్ థనుష్ అందిస్తుండడం ఓ విశేషమైతే...
దాదాపు 20 ఏళ్ల తర్వాత బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఈ చిత్రంలో నటిస్తుండడం మరో విశేషం. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ - సమీర్ తహీర్, సంగీతం - సేన్ రోల్డన్, ఎడిటింగ్ - సత్యరాజ్, ఆర్ట్ డైరెక్టర్ - సతీష్ కుమార్, కాస్టూమ్స్ డిజైనర్ - పూర్ణిమ, స్టంట్ డైరెక్టర్ - ఎ.ఎన్.ఎల్ అరసు, ప్రొడక్షన్ హెడ్ - అరవింద్ అశోక్ కుమార్, కో - ప్రొడక్షన్ - డి.ప్రనతమన్, ఎ.కె.నటరాజ్,
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments