విశాల్ కోసం ధనుష్ పాట
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ చిత్రాల కథానాయకుడు ధనుష్.. బహుముఖప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా గానం, నిర్మాణం, దర్శకత్వం.. వంటి విభాగాల్లోనూ రాణించారు ఈ మల్టీ టాలెంటెడ్ హీరో.
తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ధనుష్ మరో తమిళ్ హీరో కోసం తన గొంతుని సవరించుకోనున్నారని తెలిసింది. తెలుగులో అనువాదమైన పందెం కోడికి సీక్వెల్‌గా సందకోళి 2` (తెలుగులో పందెంకోడి 2) పేరుతో మరో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసమే ఒక రొమాంటిక్ పాటను పాడనున్నారు ధనుష్. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ పాటని ధనుష్ పాడగా.. విశాల్, కీర్తిసురేష్ పై చిత్రీకరించనున్నారు.
పందెంకోడి చిత్రానికి దర్శకత్వం వహించిన లింగు స్వామియే ఈ సీక్వెల్ కి కూడా దర్శకుడు. సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. 3 చిత్రంలోని కొలవెరి డీ పాటతో ఫిలింఫేర్ అవార్డుని కూడా సొంతం చేసుకున్న ధనుష్.. కొలవెరి డీ పాటకి ముందు, తర్వాత కూడా చాలా పాటలే పాడారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com