విశాల్ కోసం ధనుష్ పాట

  • IndiaGlitz, [Friday,December 01 2017]

త‌మిళ చిత్రాల క‌థానాయకుడు ధ‌నుష్‌.. బ‌హుముఖ‌ప్ర‌జ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. కేవ‌లం న‌ట‌న‌కే ప‌రిమితం కాకుండా గానం, నిర్మాణం, ద‌ర్శ‌క‌త్వం.. వంటి విభాగాల్లోనూ రాణించారు ఈ మ‌ల్టీ టాలెంటెడ్ హీరో.

తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ధ‌నుష్ మరో తమిళ్ హీరో కోసం తన గొంతుని సవరించుకోనున్నార‌ని తెలిసింది. తెలుగులో అనువాద‌మైన పందెం కోడికి సీక్వెల్‌గా సందకోళి 2' (తెలుగులో పందెంకోడి 2) పేరుతో మ‌రో చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా కోస‌మే ఒక రొమాంటిక్ పాటను పాడనున్నారు ధ‌నుష్‌. యువన్ శంకర్ రాజా కంపోజ్‌ చేసిన ఈ పాటని ధనుష్ పాడగా.. విశాల్, కీర్తిసురేష్ పై చిత్రీకరించనున్నారు.

పందెంకోడి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ లింగు స్వామియే ఈ సీక్వెల్ కి కూడా దర్శకుడు. సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. 3 చిత్రంలోని కొలవెరి డీ పాటతో ఫిలింఫేర్ అవార్డుని కూడా సొంతం చేసుకున్న ధ‌నుష్‌.. కొలవెరి డీ పాట‌కి ముందు, తర్వాత కూడా చాలా పాటలే పాడారు.