బిగ్ సర్ ప్రైజ్.. మరో తెలుగు డైరెక్టర్ తో ధనుష్ పాన్ ఇండియా మూవీ
Send us your feedback to audioarticles@vaarta.com
సౌత్ లో ధనుష్ క్రేజీ స్టార్ గా మారిపోతున్నారు. ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకుంటూ అందులో పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్న ధనుష్ కు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ధనుష్ మ్యానరిజమ్స్ ఇప్పటి యువతలో ట్రెండ్ గా మారిపోయాయి.
ఇదీ చదవండి: ప్రారంభమైన ప్రశాంత్ వర్మ సూపర్ హీరో మూవీ 'హను మాన్'!
అసురన్, కర్ణన్ తరహాలోనే ధనుష్ తన విభిన్న చిత్రాల పంథా కొనసాగిస్తున్నాడు. దీని కోసం ధనుష్ కేవలం తమిళం కు మాత్రమే పరిమితం కావడం లేదు. హ్యాపీ డేస్, లీడర్, ఫిదా ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేని చిత్రాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు శేఖర్ కమ్ముల. కమ్ముల, ధనుష్ కాంబో సెట్ అవుతుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటిది కమ్ములకు ఇటీవల ధనుష్ ఒకే చెప్పడం ఆ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగిపోయింది.
తాజాగా ధనుష్ మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. మరో తెలుగు డైరెక్టర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీలో నటించేందుకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. వెంకీ అట్లూరి. తొలి ప్రేమ చిత్రంతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి రీసెంట్ గా నితిన్ తో రంగ్ దే అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ప్రేమ కథలని డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు ఈ యంగ్ డైరెక్టర్. మరి ధనుష్ కోసం ఎలాంటి సబ్జెక్టు ఎంచుకున్నాడనేది ప్రస్తుతానికి సర్ ప్రైజ్. ధనుష్, వెంకీ అట్లూరి కాంబోలో చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబందించిన పూర్తి డీటెయిల్స్ త్వరలో వెల్లడి కానున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com