Nene Vasthunna: ధనుష్ 'నేనే వస్తున్నా' చిత్రం నుండి 'ఒకే ఒక ఊరిలోనా' పాట విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. "నేనే వస్తున్నా" పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది.
తాజాగా ఈ చిత్రం నుండి "ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా" పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం.
ఈ పాటను చంద్రబోస్ రచించారు.
"పాముల్లోనా విషముంది,పువ్వులోని విషముంది
పూలను తల్లో పెడతారే పామును చూస్తే కొడతారే
మనిషిలో మృగమే దాగుంది, మృగములో మానవత ఉంటుంది"
లాంటి లైన్స్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న ధనుష్ లోని రెండు విభిన్నకోణాలని ఆవిష్కరించడమే కాకుండా, ఆలోచించే విధంగా ఉన్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను ఎస్.పి.అభిషేక్, దీపక్ బ్లూ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై "కలైపులి ఎస్ థాను" నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లుఅరవింద్ విడుదల చేస్తున్నారు.సెప్టెంబర్ 29 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: ధనుష్, ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు మరియు యోగిబాబు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com