Dhanush Nagarjuna:ధనుష్, నాగార్జున మల్టీస్టారర్ మూవీ షూటింగ్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో ధనుష్.. తెలుగు సినిమా దర్శకులపై మక్కువ పారేసుకుంటున్నారు. ఇటీవల యువ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' మూవీ తెలుగుతో పాటు తమిళంలో తీసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు భాషల్లో మంచి హిట్ అందుకుంది. దీంతో ఇప్పుడు మరో తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీలో ధనుష్‌తో పాటు కింగ్ అక్కినేని నాగార్జున కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. అంటే ఇది మల్టీస్టారర్ మూవీ అని చెప్పవచ్చు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మీక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు.
క్లాస్ మూవీలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ దక్కించుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం పూజాకార్యక్రమం ఈరోజు అట్టహాసంగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాతలు సునీల్ నారంగ్ తదితరులు హాజరయ్యారు. పూజా కార్యక్రమంతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ధనుష్ మీద కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెట్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.
ఇక ఇటీవల ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' సినిమాతో తమిళంలో హిట్ కొట్టారు. ఈ సినిమా పొంగల్ కానుకగా విడుదలై అభిమానులను అలరించింది. తెలుగులో రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ నాగార్జున, వెంకటేష్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. తెలుగులోనూ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా నాలుగు తెలుగు చిత్రాలు విడుదల కావడంతో మూవీ విడుదలను వాయిదా వేశారు. అటు'ఫిదా', 'లవ్ స్టోరీ'వంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. వీరి కాంబోతో పాటు నాగార్జున వంటి స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com