సోష‌ల్ మీడియాలో ధ‌నుష్ మార్క్‌

  • IndiaGlitz, [Wednesday,July 13 2016]

త‌మిళ హీరో అయ‌నప్ప‌టికీ విల‌క్ష‌ణ క‌థ‌లు, కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు చేసుకుంటూ తమిళ ప్రేక్ష‌కుల‌కే కాకుండా తెలుగు, హిందీ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో ధ‌నుష్‌. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అల్లుడైనా ఎక్క‌డా ఆయ‌న్ను ఫాలో కాకుండా ఆయ‌న అభిమానిగా ఉంటున్న ధ‌నుష్ సోష‌ల్ మీడియాలో ఓ మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు.

ట్విట్ట‌ర్‌లో ధ‌నుష్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య మూడు మిలియ‌న్స్‌కు చేరింది. సినిమాల‌తో పాటు ట్విట్ట‌ర్‌లో కూడా ధ‌నుష్ యాక్టివ్‌గా ఉంటూ త‌న సినిమాల‌కు సంబంధించిన విశేషాల‌ను తెలియ‌జేస్తుంటాడు. ఈ విష‌యం ధ‌నుష్ అభిమానుల‌కు సంతోషాన్నిచ్చే విష‌య‌మే.