బాలీవుడ్ రీమేక్‌లో ధనుష్
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణమైన పాత్రలు.. వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ముందుండే కథానాయకుడు ధనుష్. ఈ హీరో ప్రస్తుతం `అసురన్` సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇవి కాకుండా రీసెంట్‌గా ఓ బాలీవుడ్ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ సినిమా ఏదో కాదు.. బాలీవుడ్ చిత్రం `అంధాదూన్`. హిందీలో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించాడు. ఈ థ్రిల్లర్ మూవీ రీమేక్ హక్కులను దక్కించుకునే ప్రయత్నాల్లో ధనుష్ అండ్ టీం ఉందట. ఈ మధ్య రీమేక్ చిత్రాల్లో నటించి చాలా కాలమైంది. `అంధాదూన్` అద్భుతమైన చిత్రం. దీన్ని మన ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నానని ధనుష్ తెలిపారు. అంతా ప్లానింగ్ ప్రకారం జరిగితే ధనుష్ ఈ రీమేక్‌లో గుడ్డివాడి పాత్రలో మనల్ని మెప్పించడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com