ధనుష్ స్ట్రయిట్ తెలుగు మూవీ.. టైటిల్ ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, తమిళ స్టార్ హీరో ధనుష్‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ వుంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. ఇంకా చెప్పాలంటే తమిళ్ కంటే ఎక్కువగా కలెక్షన్స్ సాధించిన దాఖలాలు ఎన్నో. ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుల కోసం స్ట్రయిట్ మూవీలో నటించాలని నిర్ణయించుకున్నారు ధనుష్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి.. ధనుష్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ఈ మేరకు ధనుష్ బుధవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. 'తమిళంలో నా నెక్స్ట్ మూవీ, తెలుగులో నా తొలి సినిమా.. రేపు ఉదయం 9 గంటల 36 నిమిషాలకు టైటిల్ వెల్లడిస్తాం' అంటూ ఆయన ట్వీట్ చేశాడు.
చెప్పినట్లుగానే ఈ తొలి తెలుగు సినిమాకు 'సర్' (SIR) టైటిల్ ఖరారు చేశారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఇదే టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే క్లాస్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ములతో ధనుష్ ఓ సినిమా ప్రకటించారు. అయితే... ఆ సినిమా కంటే 'సర్' ముందుగా సెట్స్ మీదకు వెళ్లనుంది. అందుకే, హీరో ధనుష్ కూడా ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ లో తన ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా అని పేర్కొన్నారు.
ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ .. దీనికి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమాను ప్రోడ్యూసర్స్ గిల్డ్ సూచన మేరకు ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు మేకర్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com