హైదరాబాద్ లో అడుగుపెట్టిన ధనుష్.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్!

  • IndiaGlitz, [Thursday,July 01 2021]

మూస కథలకు చెక్ పెట్టి సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు ధనుష్. తనదైన పంథాలో ధనుష్ వైవిధ్యం ఉన్న చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. అసురన్, కర్ణన్ లాంటి చిత్రాలలో ధనుష్ నటనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ధనుష్ తన 43వ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

కరోనా ప్రభావంతో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు సెకండ్ వేవ్ కేసులు తగ్గుతుండడంతో షూటింగ్ తిరిగి ప్రారంభిస్తున్నారు. ధనుష్ 43వ చిత్రం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక కేవలం ఒక్క షెడ్యూల్ షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఫైనల్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ఫినిష్ చేయనున్నారు.

ఇదీ చదవండి: జల్సాలో పవన్.. RRR లో ఎన్టీఆర్.. దీని వెనుక ఇంత కథ ఉందా..

దీనికోసం ధనుష్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాడు. నేటినుంచి ఫైనల్ షెడ్యూల్ షూట్ ప్రారంభం కానుంది. ఫైనల్ షెడ్యూల్ కోసం ధనుష్ యుఎస్ నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ధనుష్ కి జోడిగా మాళవిక మోహన్ నటిస్తోంది. సత్య జ్యోతి ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ధనుష్ నేరుగా రెండు తెలుగు చిత్రాల్లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండూ పాన్ ఇండియా చిత్రాలే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అలాగే యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా ధనుష్ నటించబోతున్నాడు. ఆల్మోస్ట్ ఫైనల్ అయిన ఈ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనున్నట్లు టాక్.

More News

రోజుకి ఎన్ని సిగరెట్స్ తాగుతావ్ ? రష్మికకు నెటిజన్ ప్రశ్న!

సౌత్ లో ప్రస్తుతం రష్మిక క్రేజ్ పీక్స్ లో ఉంది. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో రష్మిక అవకాశాలు అందుకుంటోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక తక్కువ టైంలోనే పాపులారిటీ సొంతం చేసుకుంది.

1950 నేపథ్యంలో కళ్యాణ్ రామ్ మరో ప్రయోగం?

ఇకపై బలమైన కథాంశం ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకోవాలని కళ్యాణ్ రామ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

లగ్జరీ కారు కొనుగోలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. అంత ఖరీదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త కారు కొనబోతున్నారట.

శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి.. 'అఖండ' కడపలో అంట!

మాస్ ఆడియన్స్ కు మంచి కిక్కిచ్చే దర్శకుడు బోయపాటి శ్రీను.

టీడీపీకి షాక్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని స్వాధీనం చేసుకోవాలి.. కేసీఆర్ కు లేఖ

పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగానే ఉన్నట్లు అనిపిస్తోంది.