ధనుష్ ద్విపాత్రాభినయంతో వస్తోన్న 'ధర్మయోగి' (ది లీడర్)

  • IndiaGlitz, [Friday,September 30 2016]

'రఘువరన్‌ బి.టెక్‌' చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో ధనుష్‌ తాజాగా 'రైల్‌' చిత్రంతో ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చారు. ఈ దీపావళికి మరో డిఫరెంట్‌ మూవీతో ధనుష్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన 'కొడి' చిత్రంలో తొలిసారి ధనుష్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం 'ధర్మయోగి'(ది లీడర్‌) పేరుతో తెలుగులో విడుదల కానుంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ - ''ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన 'కొడి' చిత్రంపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. తెలుగులో ధనుష్‌కి వున్న ఫాలోయింగ్‌ అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో ధనుష్‌ చేసిన రెండు క్యారెక్టర్స్‌ పూర్తి విభిన్నంగా వుంటాయి. ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా పాటల రికార్డింగ్‌, డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చెయ్యబోతున్నాం. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'కబాలి' చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు చేశారు. ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌ రెండో వారంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం పెద్ద హిట్‌ అయి మా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌కి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్‌ ఎస్‌., ఎడిటింగ్‌: ప్రకాష్‌ మబ్బు, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్‌.సతీష్‌కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌.

More News

బాహుబలికి ఆది లేదు అంతం లేదు - నేను లేకపోయినా బాహుబలి ఎప్పటికీ ఉండాలి - రాజమౌళి

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సంచలన చిత్రం బాహుబలి.ప్రభాస్,రానా,అనుష్క,తమన్నా,రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన బాహుబలి చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు.

నరేంద్ర మోడీకి అభినంద‌న‌లు తెలియ‌చేసిన కృష్ణంరాజు..!

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర‌వాద చొర‌బాటు శిబిరాల‌పై మెరుపుదాడులు చేసి విజ‌యం సాధించిన భారత సైన్యానికి దేశం యావ‌త్తు జై కొడుతుంది. ఈ దాడులు గురించి వివ‌రించాడానికి ఏర్పాటు చేసిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో నేత‌లంతా సైన్యాన్ని ప్ర‌శంసించారు.

ఊటీలో మిస్ట‌ర్ వ‌రుణ్ తేజ్ కు గాయాలు..!

మెగా హీరో వ‌రుణ్ తేజ్ మిస్ట‌ర్, ఫిదా చిత్రాల్లో న‌టిస్తున్నారు. శేఖ‌ర్ క‌మ్ముల ఫిదా చిత్రాన్ని తెర‌కెక్కిస్తుంటే, శ్రీను వైట్ల మిస్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

అభినేత్రి సెన్సార్ పూర్తి..!

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఎ.ఎల్. విజ‌య్ తెర‌కెక్కించిన విభిన్న క‌థాచిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేష‌న్, బ్లూ స‌ర్కిల్ కార్పోరేష‌న్, బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి.

నేచుర‌ల్ స్టార్ నాని సెంటిమెంట్..!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం మ‌జ్ను. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయేల్, ప్రియ న‌టించారు. ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వ‌ర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇటీవ‌ల రిలీజైన విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం  మ‌జ్ను పాజిటివ్ టాక్ తో స‌క్సెస్ ఫుల్ గా  ర‌న్ అవుతుంది.