ధనుష్ ధర్మయోగి వాయిదా..!
Thursday, October 27, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో ధనుష్ మొదటిసారి ద్విపాత్రాభినయంలో, త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ధర్మయోగి. ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్‌మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.హెచ్.సతీష్‌కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని 'యు' సర్టిఫికెట్ పొందింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్టోబర్ 28న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్ మాట్లాడుతూ - ''మా చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని 'యు' సర్టిఫికెట్ పొందింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రాన్ని అక్టోబర్ 28న విడుదల చేయలేకపోతున్నాం. అక్టోబర్ 29న దీపావళి కానుకగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 500 థియేటర్లలో మా 'ధర్మయోగి' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.
ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఎస్.ఎ.చంద్రశేఖర్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్ ఎస్., ఎడిటింగ్: ప్రకాష్ మబ్బు, సంగీతం: సంతోష్ నారాయణన్, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్.సతీష్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments