అప్పుడు త్రిష..ఇప్పుడు కాజోల్....మధ్యలో ధనుష్
Send us your feedback to audioarticles@vaarta.com
ధనుష్ హీరోగా రూపొంది ఘన విజయం సాధించిన వేల ఇల్లాద పట్టదారి సినిమాను తెలుగులో రఘవరన్ బి.టెక్ పేరుతో విడుదల చేస్తే తెలుగులో కూడా రఘవరన్ బి.టెక్ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ధనుష్ కథ, మాటలు అందిస్తున్నారు.
ఈ సినిమాలో హిందీ నటి కాజోల్ ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెరుపు కలలు సినిమా తర్వాత కాజోల్ తమిళంలో చేస్తున్న సినిమా ఇది. మొదటి పార్ట్ సక్సెస్ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా సీక్వెల్లో కాజల్ నెగటివ్ రోల్లో నటిస్తుందని సమాచారం. రీసెంట్గా ధనుష్ కొడి(ధర్మయోగి) సినిమాలో త్రిష హీరోయిన్‌గానే కాకుండా నెగటివ్ రోల్ కూడా చేసింది. ఇప్పుడు కాజోల్ నెగటివ్ క్యారెక్టర్లో కనపడనుంది. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధనుష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments