ధనుష్ కి కొత్త సమస్య....
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో, నిర్మాతగా ఉన్న ధనుష్ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు కూడా. తెలుగు, బాలీవుడ్లో కూడా ధనుష్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పడు ధనుష్‌కి ఓ సమస్య వచ్చి పడింది. ధనుష్ తమ కుమారుడని మధురై జిల్లాకు చెందిన దంపతులు కోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన న్యాయస్థానం జనవరి 12న ధనుష్ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
మధురై జిల్లా మేలూరు సమీపంలోని కదిరేశన్, మీనాల్ దంపతులు ధనుష్ చిన్నప్పుడే సినిమాలపై ఆసక్తితో ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడని, తన అసలు పేరు కలైసెల్వన్ అని సదరు దంపతులు కేసులో తెలిపారు. అంతే కాకుండా తాము డి.ఎన్.ఎ. టెస్టుకు కూడా సిద్ధమని అంటున్నారు. అవసాన దశలోని తాము ఇప్పుడు కుమారుడితో కలిసి ఉండాలనుకున్నామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments